రష్మిక మందన్నా - విజయ్ దేవరకొండ .. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వీరిద్దరికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రష్మిక మందన్నా “ఛలో” సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటినుండి, ఆమె తన సామర్థ్యం, స్టైల్, వ్యక్తిత్వం ద్వారా తానేంటో ప్రూవ్ చేసుకుంటూ పైకెక్కింది. ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా – అంటే “మోస్ట్ వాంటెడ్ హీరోయిన్”గా స్థాయి దక్కించుకుంది. విజయ్ దేవరకొండకు “అర్జున్ రెడ్డి” సినిమా తో  శక్తివంతంగా మారాడు. ఆ సినిమాతో, అతను అనూహ్య మార్గంలో టాప్ హీరోలా పేరు చాటుకున్నాడు.


వీరిద్దరి మధ్య ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. “మేము ప్రేమించుకుంటున్నాం” అని అధికారికంగా ఒకసారి కూడా ప్రకటించకపోయినా, వారి మధ్య ఉన్న అనుబంధం అనేకసార్లు పరోక్షకంగా చెప్పేశారు. పలు సార్లు రెస్టారంట్లలో, బీచ్‌లలో కలుసుకోవడం, అక్కడ తీసిన చిత్రాలు మీడియాలో వైరల్ కావడం అందరికి తెలిసిందే.



ఇప్పుడు, ఈ ప్రేమకథ ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. వీళ్లిద్దరి నిశ్చితార్థం చేసుకున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి స్టార్స్ కి సంబంధించి ఇలాంటివి జరుగుతున్నప్పుడు  సన్నిహిత వర్గాల్లో నుంచి ఒక సమాచారం ఏదైనా వచ్చినప్పుడు మీడియా లో కొచెం అయిన హడావుడి కనిపిస్తుంది. కానీ రష్మిక–విజయ్ జంట మాత్రం ముందే ప్లాన్ చేసి, ఎంతో జాగ్రత్తగా, సైలెంట్‌గా ఈ నిశ్చితార్థాన్ని పూర్తి చేశారు అంటూ చెప్తున్నారు స్టార్స్.



నిశ్చితార్ధం అయిపోయిన తరువాత ఈ న్యూస్ బయటపడ్డింది. ఇప్పుడు  సోషల్‌ మీడియాలో, నేషనల్ మీడియాలో  పలువురు దీని గురించే చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్, మీడియా అంచనాల ప్రకారం, ఈ సీరియస్ నిర్ణయానికి కారణం “ప్రైవేట్ లైఫ్” గౌరవించుకోవడంతో పాటు, ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగతంగానే ఉంచుకోవడం అనేది వారిద్దరికీ ముఖ్యమైన భావన అని బ్త్యెలుస్తుంది.  “ఇంత సడన్‌గా నిశ్చితార్థం చేయాల్సిన పరిస్థితి ఎందుకు?” అన్న క్వశ్చన్ కి కొందరు ఫ్యాన్స్ ఆన్సర్ ఇస్తున్నారు. "ఇంట్లో ఫోర్స్ చేసిన కారణంగానే ఇంత సడెన్ గా నిశ్చితార్ధం చేసుకున్నారు అని " క్లారిటీ ఇస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా, హర్షంగా ఈ నిశ్చితార్థాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రసెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!



ఇప్పటివరకు రష్మిక మందన, విజయ్ దేవరకొండ ఇద్దరు తమ నుండి ఎటువంటి అధికారిక స్పందన ఇచ్చారు కుదరలేదు. కానీ ఈ విషయం త్వరలో వారిలో ఒకరు స్పందించగలరు — అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: