జబర్దస్త్ బుల్లితెరపై రాకింగ్ రాకేష్ ప్రతి ఒక్కరికి పరిచయమే.. మిమిక్రీ ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టిన రాకేష్ ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ అందుకున్నారు. చాలా సంవత్సరాలు జబర్దస్త్ లోనే కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.. ఆ తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గా నటించారు రాకేష్ ఇటివలె నిర్మాతగా మారి ఒక మెయిన్ లీడ్ లో నటించడం జరిగింది. ఆ చిత్రమే కెసిఆర్ ఈ చిత్రాన్ని గరుడవేగ అంజి దర్శకత్వంలో నటించడం జరిగింది.


కెసిఆర్ చిత్రానికి సంబంధించి పోస్టర్లు కూడా విడుదల చేయడం జరిగింది. ఇది అచ్చ తెలుగు సీఎం కేసీఆర్ లాగానే ఉండడంతో వైరల్ గా మంచి పాపులారిటీ అందుకుంది. అయితే ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమాని ప్రకటించడంతో మరింత వైరల్ గా మారుతోంది .ఈ పోస్టర్ లాంచింగ్ మినిస్టర్ మల్లారెడ్డి చేయడం గమనార్హం. రాకేష్ ఈ సినిమాని తెలంగాణ ఎలక్షన్ల కంటే ముందుగానే నవంబర్ చివరిలో విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ సినిమా మొదటి కాఫీ కూడా సిద్ధమైనప్పటికీ సెన్సార్ సభ్యులు కూడా పూర్తి చేయడం జరిగింది.


అయితే రాకింగ్ రాకేష్ కి ఎలక్షన్ కమిషనర్ మాత్రం ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాకేష్ తెరకెక్కించిన కేసీఆర్ చిత్రాన్ని ఎలక్షన్స్ అయ్యే వరకు నిలిపివేయాలని నోటీసులను కూడా జారీ చేసింది. ఈ సినిమాకి కేసీఆర్ అని పేరు పెట్టడం పొలిటికల్స్ మీద ఈ సినిమా ఉందని తెలియడంతో ఎన్నికల కమిషనర్ కూడా రాకేష్ కి ఈ సినిమా నిలిపివేయాలని నోటీసులను సైతం పంపించినట్లు తెలుస్తోంది. ఇటీవలే రాకేష్ తన సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి మరి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాను విడుదల చేయాలనుకున్నాను కానీ ఇలాంటి సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువలన ఈ సినిమా రిలీజ్ చేయలేకపోయామని తెలియజేశారు అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: