టాలీవుడ్ లో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ఒకవైపు అల్లు అర్జున్ హీరోగా నటిస్తూ పాన్ ఇండియా హీరోగా భారీ పాపులారిటీ సంపాదిస్తున్నారు.. అల్లు శిరీష్ కూడా అడపాదప సినిమాలతో తన కెరియర్ని ముందుకు తీసుకువెళ్తున్నారు.. అల్లు బాబి కూడా బిజినెస్ పరంగా కాస్త యాక్టివ్గానే ఉన్నారు..అల్లు అరవింద్ మాత్రం అటు నిర్మాతగానే ఆహా అనే ఓటీటి సమస్త తో బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఇప్పుడు తాజాగా ఆహా ఓటీటి సంస్థ అమ్మకానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


ఆహా అతి తక్కువ సమయంలోనే విడుదలైన ఈ ఓటీటి సంస్థ 2020 లో అల్లు అరవింద్ ప్రారంభించారు.. అయితే ఇందులో అల్లు అరవింద్ తో పాటు జాపల్లి రాము రావు కూడా భాగస్వామ్యంలో ఉన్నారట.. ఇందులో తెలుగు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ఇతరత్రా ఇంటర్వ్యూలను చేస్తూ ఉంటారు.. బాలయ్య హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ సీజన్ కి కూడా భారీగానే క్రేజ్ ఉన్నది.. దీంతో అతి తక్కువ సమయంలోనే ఆహా తెలుగులోనే టాప్ పొజిషన్ లోకి ఎదిగింది..


ఇతర ఓటిటి ప్లాట్ ఫామ్ కంటే ఆహా వెబ్ సైట్ చాలా తక్కువ ధరకే కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఆహ నీ ఉపయోగిస్తూ ఉన్నారు.. తాజాగా సోనీ ,సన్ నెట్ ఆహా ఓటిటిని కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆహనీ నడుపుతున్న అర్హ మీడియా బ్రాడ్ కాస్టింగ్ లో సోనీ వాట కోసం చర్చలు జరుపుతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. అయితే ఆహా సమస్త రూ .1500 కోట్ల నుంచి రూ .2000 కోట్ల వరకు వాల్యూ చేస్తుందని వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఆహా అమ్మకానికి వచ్చిన వార్త పైన అల్లు టీమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: