ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఆహా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఫ్యామిలీ అండ ఉండడంతో బాగానే నెట్టుకొస్తున్నారు అల్లు అరవింద్.. ఇటీవలే నాగబాబు చేసిన ట్వీట్ వల్ల మెగా కుటుంబంలో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నాగబాబు కూడా డి యాక్టివేషన్ అకౌంట్ ని చెసి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు.  ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందనీకోగా కానీ ఈ వివాదం ప్రభావం ఆహా పైన పడినట్టుగా కనిపిస్తోంది.


ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాగబాబు బన్నీ గురించి చేసినటువంటి ట్విట్ పెను దుమారాన్ని రేపింది. ముఖ్యంగా అల్లు అర్జున్ తన స్నేహితుడు కోసం వైసీపీ తరఫున సపోర్టు చేయడం జరిగింది. దీంతో సోషల్ మీడియాలో నాగబాబుని కూడా ట్రోల్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఎప్పుడు ఆహా దాక రావడం జరిగింది.. ఈ వివాదంలో అల్లు అర్జున్ ముందుకు వచ్చి వివరణ ఇచ్చినప్పటికీ అటు మెగా కుటుంబం పవన్ అభిమానులు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఈ ప్రభావం ఎప్పుడు ఆహా పైన కూడా పడుతున్నట్లు కనిపిస్తోంది.


ఆహా సబ్స్క్రైబ్ చేయండి రద్దు చేసుకోమని పవన్ అభిమానుల సైతం ట్విట్టర్ ఫేస్బుక్లలో చాలా వైరల్ గా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆహా సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.. గత కొద్దిరోజులుగా చెప్పుకోదగిన స్థాయిలో మాత్రం పేరు రాలేక అమ్మేయబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇలా సభ్యత్వాలను కూడా రద్దు చేసుకుంటే ఖచ్చితంగా ఆహా కి నష్టం వస్తుందని చెప్పవచ్చు. 2020లో అర్హ మీడియా బ్రాడ్కాస్టింగ్ తెలుగులో సక్సెస్ అయిన తర్వాత 2022లో తమిళంలో ఆహా ఓటీటీ ని లాంచ్ చేశారు. ఇందులో సినిమాలు వెబ్ సిరీస్ ఇతరత్రా షో లు ప్రచారం అవుతూ ఉన్నాయి.. వీటి పైన ఆహాకి భారీగానే ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర ఓటీటీ ప్లాట్ఫామ్లతో పోలిస్తే ఆహా సబ్స్క్రిప్షన్ ద్వారా చాలు తక్కువగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

AHA