రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రేక్షకులకు యూట్యూబర్ హర్ష సాయి గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా నిరుపేద ప్రజలకు సహాయం చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పేదల యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు. వారికి కావలసిన డబ్బు టీవీలు ఫ్రిడ్జ్లు ఇలా ఏది అడిగినా కూడా అది సడన్ సర్ప్రైజ్ తో అందిస్తూ ఉంటారు. తన ఫాలోవర్స్ని సైతం రోజురోజుకి పెంచుకుంటూ ఉంటారు హర్ష సాయి.. ఇలాంటి పాపులారిటీ సంపాదించుకున్న హర్ష సాయి ఒక ఫ్రాడ్ అని అతడు మోసగాడని అతని వెనుక ఒక మాఫియా ఉందంటూ యువ సామ్రాట్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారువాస్తవానికి ఈయన యూఎస్ఏ లో ఉన్నప్పటికీ హర్ష సాయి చేసే కార్యక్రమాల పైన స్పందిస్తూ ఎన్నో రకాల వీడియోలను సైతం చేస్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా యువ సామ్రాట్ రవి సంచలన ఆరోపణలు చేశారు. హర్ష సాయి వెనుక ఒక మాఫియా నడుపుతున్నాడని అతనికి నోయిడాకి చెందిన ఒక పెద్ద ముఠా ఉందంటూ వెల్లడించారు. పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారని తెలిపారు. ఒక ఇన్ఫ్లు ఇయర్ కి  20 వేలకు పైగా ఫాలోవర్స్ ఉంటే కంపెనీ వారిని కాంటాక్ట్ అయ్యి బెట్టింగ్ యాప్స్ అన్ని ప్రమోట్ చేయడానికి సహకరించమని డబ్బులు కూడా ఇస్తుందట.


ఇలా చేసినందుకు వాళ్లకి లక్షలలో డబ్బులు ఇస్తూ ఉంటారని బ్యాంకుల్లో పడ్డ డబ్బులే కాకుండా డైరెక్ట్ గా కూడా మనీ తీసుకుంటూ ఉంటారని ఈమధ్య కాలంలో నోవాటేల్ హోటల్లో హర్ష డబ్బు తీసుకున్నట్లు డేట్ టైము కూడా చెబుతానని ఆ టైమ్ కు వెళ్లి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటే అతడి అసలు నిజస్వరూపం బయట పడుతుందంటూ యువ సామ్రాట్ రవి వెల్లడించారు. హర్ష సాయి మీద నేనే చేసిన ప్రతి కామెంట్స్ పైన తన దగ్గర ప్రూఫ్ లో ఉన్నాయని వెల్లడించారు. కేవలం మంచోడుగా పేద ప్రజలను వాడుతున్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: