తెలుగు బుల్లితెరపై వెండితెరపై సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. బుల్లితెర మెగాస్టార్ గా పేరుపొందిన సుధీర్ ఏ షోలో నటించారంటే అషో కచ్చితంగా హిట్టే.. సుధీర్ టీమ్ లీడర్ గా ఎదిగి ఆ తర్వాత ఎన్నో షోలకు యాంకర్ గా పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాతే వెండితెర మీద ఎంట్రీ ఇచ్చారు.. ముఖ్యంగా సుదీర్ ,రష్మీ జంటకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. వీరిద్దరూ కలిసి ఎన్నో షోలు చేసి పలు రకాల రికార్డుల టిఆర్పి రేటింగ్ ను రికార్డు మొత్తంలో సృష్టించారు.



ఈ షోల ద్వారా వచ్చిన పాపులారిటీ వీరికి సినిమా అవకాశాలు కూడా దక్కించుకునేలా చేసాయి. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలామంది అభిప్రాయపడేవారు.. జబర్దస్త్ షూటింగులు ఎక్కువగా వీరిద్దరూ కలుసుకున్న ఫోటోలు వీడియోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా అలాగే అనుకునేవారు.. దీంతో వివాహం చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ అదంతా కూడా కేవలం షో టిఆర్పి రేటింగ్ కోసం మాత్రమే అని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా సుధీర్ పెళ్లికి సిద్ధమయ్యారని వార్త వినిపిస్తోంది.



అది కూడా ఇండస్ట్రీకి చెందిన ఒక బడా ప్రొడ్యూసర్ కూతురుతో అన్నట్లుగా సమాచారం. సుదీర్ టాలెంట్ ను చూసి ఒక తెలుగు నిర్మాత తన కూతురుకి సుదీర్ ని ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నారట.. ఇక ఆమెకు కోట్ల రూపాయలు ఆస్తి ఉందని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా సుదీర్ జాతకం కూడా మారిపోతుందని ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది . మరి ఆ వడ ప్రొడ్యూసర్ ఎవరు అన్న విషయం తెలుపలేదు..మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి సుడిగాలి సుదీర్ పెళ్లి గురించి ఈ న్యూస్ వినిపిస్తోంది.. అయితే ఈ న్యూస్ విన్న రష్మీ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ.. ఏంటి సుధీర్ నిజంగానే టాలీవుడ్ బడా కూతుర్ని వివాహం చేసుకోబోతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి ఈ విషయం పైన సుధీర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: