యాంకర్ సుమ.. సుమ అడ్డ షోకి యాంకర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో ఎంతోమంది సెలబ్రెటీలు కూడా పాల్గొంటు అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా టుక్ టుక్ సినిమా చిత్ర బృందం పాల్గొన్నారు.ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రిమింగ్ అవుతున్నదట. ఇందులో కోర్టు సినిమా హర్ష రోషన్, సలార్ సినిమా కార్తికేయ దేవ్ తదితరులు సుమ అడ్డ షోలో పాల్గొనడం జరిగింది. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతున్నది.


ఈ ప్రోమో విషయానికి వస్తే.. రీతూ చౌదరి, శ్రీ సత్య కూడా గెస్ట్ గా వచ్చారు.. ఈ చిత్రానికి సంబంధం లేకపోయినా కేవలం పిలిచారని రావడంతో.. పిలిచి మరి యాంకర్ సుమ రీతు చౌదరి పరువు తీస్తోంది.. మొదట రీతూ చౌదరి, శ్రీ సత్య ఎంట్రీ ఇవ్వగానే.. అవును మీరిద్దరూ ఎందుకు వచ్చారు అంటూ సుమ ప్రశ్నించగా? పిలిచారని వచ్చామని చెప్పగా.. ముఖం మీద మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో రీతూ చౌదరి అదోలా ఫేస్ పెట్టింది.. అయితే ఈరోజు టుక్ టుక్ చిత్ర బృందం వాళ్ళు వచ్చారని సుమ చెబుతూ ఉన్నప్పటికీ.. నిజానికి అందులో మేము ఉండాల్సింది అంటూ రీతూ చౌదరి కవరింగ్ ఇచ్చిన.. దీనికి సుమ ఇలా పంచ్ వేస్తూ పదేళ్ల క్రితం తీసుకొని ఉంటే నువ్వు ఉండే దానివి వాళ్ళ ఏజ్ చూడు.. ఒకసారి అంటూ అదిరిపోయే పంచ్ వేసింది. మళ్లీ తలదించుకుంది రీతూ చౌదరి.



ఆ తర్వాత రీతు చౌదరి టీమ్ గా ఏర్పడి కుర్రాళ్లతో హాయ్ అంటూ షేక్ అండ్ ఇవ్వగ.. ఈ విషయం చూసిన సుమ, రీతూ చౌదరితో కొంచెం జాగ్రత్తగా అంటూ పంచ్ వేసింది. దీంతో రీతు చౌదరి తట్టుకోలేక అక్క పిలిచి మరి నువ్వు దొబ్బుతున్నావు అంటూ దండం పెట్టేసింది.. ఆ తర్వాత సుమ బాయ్స్ అంటూ ఒక స్కిట్ చేశారు.. ఇందులో శ్రీ సత్య ని పొగిడేస్తూ కుర్రాళ్ళు సైతం పులిహోర కలుపుతున్న ప్రోమో వైరల్ గా మారింది.. అలా యాంకర్ సుమ, రీతూ చౌదరి మధ్య జరిగే ఫన్నీ  పంచ్లు తెగ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: