స్మార్ట్ ఫోన్ ల రంగం లోకి మళ్ళీ దిగిన నోకియా తన నోకియా 6 తో మార్కెట్ లో సంచలనం రేపుతోంది.. ఈ ఫోన్‌కు సంబంధించి చైనా అలానే ఫిలిప్పిన్స్ మార్కెట్లో జరిగిన ఫ్లాష్ సేల్స్ సెకన్ల వ్యవధిలో ముగియటంతో నోకియా 6 పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. నోకియా అభిమానుల్లో సిరికొత్త జోష్‌ను నింపుతోన్న ఈ ఫోన్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో దొరుకుతోంది.అఫీషియల్‌గా కాదండోయ్, అన్‌అఫీషియల్‌గా. నోకియా ఇండియా ఫ్యాన్స్ కోసం eBay India నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను రూ.32,440 ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉంచింది. ఫోన్ వాస్తవ ధరతో పోలిస్తే ఈ ధర రెండితలు ఎక్కువే అని చెప్పాలి. ఈ ఫోన్ ఇప్పుడు బుక్ చేసుకున్న వారికి 25 రోజుల తరువాత డెలివరీ ఉంటుందని ఈబే‌ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: