టెక్నాలజీ రోజురోజుకు మారుతోంది. కొత్త పుంతలు తొక్కుతోంది. 2జీ, 3జీ, 4జీ ఇలా మొబైల్ టెక్నాలజీ అప్ డేట్ అవుతోంది. ఇక త్వరలోనే 5జీ కూడా రాబోతుందంటున్నారు. మరి ఈ 5జీ వస్తే ఏం మార్పులు జరుగుతాయి..ఇప్పటికే 5జీ ఏ దేశాల్లో ఉంది.. ఓసారి పరిశీలిద్దాం..


అమెరికా, చైనా సహా కొన్ని దేశాల్లో ఇప్పటికే 5జి నెట్ వర్క్ అందుబాటులో ఉంది. దక్షిణ కొరియా, అమెరికా ఇప్పటికే 5జి వాణిజ్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ మనదేశం మాత్రం ఇంకా పరీక్షల స్థాయిని కూడా పూర్తి చేయలేదు. మెరుపు వేగంతో డాటా డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఎలాంటి అంతరాయం లేకుండా సమాచారాన్ని అందించేదే 5జి సెల్యూలర్‌ టెక్నాలజీ.


అత్యంత రద్దీ ఉన్న సమయంలో కూడా సెకన్‌కు 2 గిగాబిట్ల నుంచి 20 గిగాబిట్ల వేగంతో 5జి టెక్నాలజీ సమాచార మార్పిడి చేయగలదని ప్రభుత్వ కమిటీ నివేదిక పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం వాడుతున్న 4జి లింక్‌ వేగం కేవలం 6 నుంచి 7 మెగాబిట్ల వేగమే. 5జి టెక్నాలజీ వాడే యూజర్లు క్షణాల్లో ఎంత భారీ సమాచారాన్నానైనా డౌన్‌లోడ్‌ చేసుకోగలుగుతారు.


8 కె రిజల్యూషన్‌ ఉన్న సినిమాలయినా, భారీ గ్రాఫిక్స్‌ ఉండే గేమ్స్‌ అయినా క్షణాల్లో డౌన్‌లోడ్‌ అవుతాయి. ఐతే, మార్కెట్లో 5జి వస్తే యూజర్లు దానికి సరిపోయే ఫోన్లలోకి మారాల్సి ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు 5జి వాడాలంటే ఇంకా చాలా సమయం పట్టొచ్చు. ఏదేమైనప్పటికీ... ఇంటర్నెట్‌ ఆధారంగా నడిచే భారీ సేవల్లో 5జి కీలక పాత్ర పోషించబోతుందనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: