సరిగ్గా మూడేళ్ళ క్రితం మన ఇంటర్నెట్ మరియు కాల్స్ రేట్లను పరిశీలించినట్లయితే ఎంతో ఎక్కువగా ఉండడంతో పాటు ఒక్క జిబి ఇంటర్నెట్ ఖరీదు దాదాపుగా రెండు వందల రూపాయలకు పైగా ఉండేది. అయితే ఒక్కసారిగా టెలికాం రంగంలోని జియో దూసుకురావడం, ఆ వెంటనే తమ కస్టమర్లకు అత్యల్ప రెట్లకే కాల్స్, మరియు ఇంటర్నెట్ టారిఫ్ లు తీసుకురావడం జరిగింది. అయితే జియో దెబ్బకు మిగతా సంస్థలు కూడా మెట్లు దిగివచ్చి రేట్లు తగ్గించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఆ తరువాత ఎయిర్టెల్ సహా మిగతా టెలికాం కంపెనీలు అన్ని రేట్లు తగ్గించి తమ కస్టమర్లను జియో బారి నుండి కొంతవరకు కాపాడుకోవడం జరిగింది. అయితే అదే ఇప్పుడు వారి పాలిట కొత్త ముప్పుగా పరిణమించినట్లు తెలుస్తోంది. నిజానికి స్పెక్ట్రమ్ సేవలను వినియోగించుకున్నందుకు, సర్వీసు చార్జీలు, 

 

నెట్వర్క్ విస్తరణ కోసం టవర్ల పెంపుదల వంటి వాటికి గాను కేంద్ర ప్రభుత్వానికి టెలికాం కంపెనీలు, కొంత మొత్తము ఏజిఆర్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్పట్లో ఆ డబ్బును చెల్లించలేమని ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ఎట్టకేలకు కొన్నేళ్ల తరువాత నిన్నటితో ఈ కేసు విషయమై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుతో ఆ రెండు కంపెనీలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సదరు మొత్తం సొమ్మును చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. దానితో ఆ రెండు కంపెనీలు కూడా డిసెంబర్ ఒకటి నుండి చాలావరకు కాల్స్ మరియు ఇంటర్నెట్ చార్జీలు పెంచబోతున్నట్లు సమాచారం. అయితే మొదటి నుండి కస్టమర్ల తరపున ఐయుసి చార్జెస్ కొన్నేళ్లుగా భరిస్తూ వస్తున్న జియో

 

ఇటీవల తాము అవి కట్టే పరిస్థితి లేదని, కావున రాబోయే జనవరి వరకు అవి వినియోగదారులు భరించాలని, అందువలన ఇకపై ఇతర నెట్వర్క్ లకు చేసే కాల్స్ కు చార్జీలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు కొందరు టెక్ నిపుణులు చెప్తున్న వివరాలను బట్టి చూస్తే, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా మాదిరిగానే మరికొద్దిరోజుల్లో జియో కూడా కాల్స్ మరియు ఇంటర్నెట్ టారిఫ్ ధరల్లో కొంత పెంపుదల చేయబోతున్నట్లు టాక్. అయితే అది కూడా డిసెంబర్ నుండి ప్రారంభం కాబోతున్నట్లు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై జియో సంస్థ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: