కొన్ని రోజుల క్రితం, ప్రభుత్వానికి అనుకూలంగా ఏజిఆర్ తీర్పును సుప్రీంకోర్టు ఇచ్చిన తరువాత వోడాఫోన్ ఐడియా తమ నష్టాల నుంచి బయటకు వచ్చేందుకు ధరల పెంచడం తప్పదని పేర్కొన్నారు. వెంటనే, ఎయిర్టెల్ కూడా ధరల పెంపును ప్రకటించింది, అయితే జియో మాత్రం ఆచితూచి అడుగు వేసి ధరల పెరుగుదల అవసరమని భావిస్తే పెంచుతాం అని స్పష్టం చేసింది. ఈ మూడు క్యారియర్లు త్వరలో తమ సేవల ధరలను పెంచడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో వినియోగదారులు ఎంత అదనపు ధర చెల్లించాల్సి వస్తుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ధరల పెంపు ఎంత ఉండబోతుంది అనే దానిపై స్పష్టత వచ్చింది.

డెక్కన్ హెరాల్డ్ నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్ ఐడియా కస్టమర్లు భవిష్యత్తులో అన్ని రీఛార్జ్ ప్లాన్లపై అదనంగా 20 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అన్ని రీఛార్జ్ ప్లాన్సుకు 20 శాతం వరకు ధరల పెరుగుదల ఉంటుందని టెలికాం వర్గాలు ధృవీకరించాయని నివేదిక పేర్కొంది. "టెల్కోస్ ధరల ప్రాతిపదికన పెంచాలని యోచిస్తోంది తక్కువ ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ కు తక్కువ పెంపు మరియు ధర ఎక్కువ ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ కు అధిక పెంపు "అని నివేదిక పేర్కొంది. అయితే ఇది అధికారీకంగా ధృవీకరించబడలేదు.

అన్నీ టెలికాం ఆపరేటర్స్ ధరలను ఒకే రకంగా పెంచే అవకాశం ఉంది. ఇక ధరల పెంపు తరువాత ప్రతీ నెల మీ ఫోన్ బిల్లు కోసం రూ .100 వరకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కస్టమర్లు వాడే డేటా వోచర్‌లతో పాటు మిగతా ప్యాక్‌లపై కూడా ధరల పెరుగుదల వర్తిస్తుంది. ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) వల్ల కలిగే నష్టాలను భరించలేక పోయినందున రిలయన్స్ జియో ఇటీవలే తన వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్గోయింగ్ కాల్స్ చేస్తే డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ఎయిర్టెల్, వొడాఫోన్ మరియు బిఎస్ఎన్ఎల్ నంబర్లకు కాల్ చేయడానికి జియో కస్టమర్లు నిమిషానికి 6 పైసలు చెల్లించాల్సి ఉంటుంది, అయితే జియో-టు-జియో కాల్స్ ఇప్పటికీ ఉచితం.

మరింత సమాచారం తెలుసుకోండి: