ఆధార్ కార్డ్ అంటే సామాన్యునికి గుండెకాయ వంటిది. ఇది లేనిదే ఏ పని గడవదు. ఇప్పటికే ఈ ఆధార్ విషయంలో ఎన్నో అనుమానాలు చాల మందికి వస్తుంటాయి. అవన్ని తీర్చుకోవడానికి మనకు ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే తరచుగా మన చేయి జారిపోయే ఆధార్ కార్డ్‌ల కోసం ఎంతగానో హైరాన పడతాం. ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఆధార్ కార్డ్ ఉన్న వారికోసం సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అదేమంటే..

 

 

యూఐడీఏఐ తాజాగా కొత్త ఎంఆధార్ యాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. అయితే ఇదివరకు ఎంఆధార్ యాప్‌ను కలిగి ఉంటే.. వినియోగదారులకు వాటికి అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని యూఐడీఏఐ ఆధార్ సూచిస్తోంది. కాగా కొత్తగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది.

 

 

ఇక ఈ కొత్త యూఐడీఏఐ యాప్‌లో పలు రకాల సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ మీరు గనుక ఈ యాప్‌ను ఉపయోగించాలనుకుంటే ముందుగా డౌన్‌లోడ్ చేసుకోని, వెరిఫై కోసం మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసుకోవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై చేసుకోవడం కోసం యాప్‌లో రిజిస్టర్ యువర్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. దీంతో మీ ఆధార్ నెంబర్‌ యాప్‌తో లింక్ అవుతుంది.

 

 

తర్వాత  ఆధార్ కార్డు మీ ఫోన్‌లోకి వచ్చేస్తుంది. ఇకపోతే ఆధార్ వినియోగదారులు ఎంఆధార్ యాప్‌తో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కనిపించకుండాపోతే, లేదంటే పాడైపోయింటే రిప్రింట్ కోసం రిక్వెస్ట్ ఇవ్వొచ్చు. ఇందుకు గాను రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇకనుండి ఈ ఆధార్ ను ఎందులోనైన దాచుకోవచ్చన్నమాట. ఈ పద్దతేదో బాగుంది కాబట్టి  ట్రై చేసి చూడండి.   

మరింత సమాచారం తెలుసుకోండి: