మన భారత దేశానికి దక్షిణాన ఉన్నహిందూ మహాసముద్రంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయట. దీని ప్రభావం ఇండియాపైనా ఉంటుందట. 'నాచురల్‌ జియో సైన్స్‌' జర్నల్‌ ఈ వివరాలు ప్రచురించింది. దీని ప్రకారం.. సముద్ర మట్టాల పెరుగుదల ఆందోళన కరంగా మారింది. గత రెండు శతాబ్దాల కాలంలో హిందూ మహాసముద్రంలో సముద్ర మట్టాలు ఒక మీటరు పెరిగాయట.

 

కొన్ని రకాల శిలాజ పగడాలు గత సముద్ర మట్టాలకు సంబంధించి ముఖ్యమైన రికార్డుగా పనిచేస్తాయని కెనడాలోని సైమన్‌ ఫార్సర్‌ యూనివర్సిటిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పాల్‌ కెంచ్‌ తెలిపారు. ఇంతకుముందెన్నడూలేని విధంగా ప్రస్తుత సముద్ర మట్టాలలో మార్పు జరిగిందా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అవసరమైన సమాచారాన్ని గత రెండు సహస్రాబ్దాలుగా జరిగిన సముద్ర మట్ట పునర్నిర్మాణాలు వివరిస్తాయన్నారు.

 

సముద్ర మట్టాలు ఎక్కడ చారిత్రాత్మకంగా ఉన్నాయో, అవి పెరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో జరిగే మార్పులకు ద్వీపాలు ఎలా స్పందించగలవనే అంశాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2017లో ప్రారంభమైన అధ్యయనం తీర ప్రాంత నగరాలకు, అక్కడ నివసిస్తున్న ప్రజలకు ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని చెబుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: