స్టార్టప్.. ఇప్పుడు యువకుల సొంత కల ఇది. ఒకరి కింద ఉద్యోగం చేయకుండా.. తామే ఓ సంస్థను నెలకొల్పాలనుకునే యువతరానికి ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే.. ఇలాంటి స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించాలని టీ హబ్ నిర్ణయించింది. స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించేందుకు టీ హబ్ చేపట్టిన ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ ల్యాబ్ 32కు కొత్తగా 45
అంకుర సంస్థలను ఎంపిక చేసింది.

 

 

ప్రస్తుతం మూడో బ్యాచ్ కింద ఆయా స్టార్టప్ సంస్థలు తమ ఆలోచనలను ఉత్పత్తి రూపంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన మెంటార్షిప్ టీ హబ్ అందిస్తుంది. దీంతో పాటు వర్చువల్ మోడల్ ప్రయోగశాల వసతి, సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన సహకారం టీ హబ్ అందించనుంది.

 

టీ హబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 45 స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో టీ హబ్ సీఈఓ రవినారాయణ్ సమావేశమయ్యారు. టీహబ్ వారికి అందించే సహాయ సహకారాల గురించి రవినారాయణ్ వివరించారు. మూడో బ్యాచ్ లో చ్లో చేరేందుకు 500 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ఉత్తమ ఆలోచనలతో ఉన్న సంస్థలను మాత్రమే ఎంపిక చేసినట్లు రవినారాయణ్ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: