ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ని తీసుకు రానుంది. మరి ఆ ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అదిరిపోయాయి. మరి పూర్తి వివరాలు ఇవే....నోకియా  2.4 స్మార్ట్ ఫోన్ ని  లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్లో హెచ్‌డీ+ డిస్ ప్లేలు, వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, నార్డిక్ కలర్ ప్యాలెట్లు అందుబాటులో ఉన్నాయి. అలానే వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే, వెనక వైపు రెండు కెమెరాలని అందించడం జరిగింది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

ఫోన్ ధర విషయానికి వస్తే.... నోకియా  2.4 ధరను కంపెనీ 119 యూరోలుగా(సుమారు రూ.10,300) నిర్ణయించడం జరిగింది. అదే రంగుల విషయానికి వస్తే..... చార్ కోల్, డస్క్, ఫోర్డ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ని కనుక కొనుగోలు చెయ్యాలంటే కొద్దీ రోజుల దాకా ఆగాల్సిందే. ఎందుకంటే మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతాయో ఇంకా తెలియలేదు.

స్టోరేజ్ వివరాల్లోకి వెళితే  3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం కూడా లభిస్తుంది. వెనకవైపు రెండు కెమెరాలు ఉండగా.... ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై పని చేయనుంది. బ్యాటరీ సామర్థ్యం వచ్చేసి  4500 ఎంఏహెచ్ గా ఉంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: