ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ మెసెంజర్ లలో ఇప్పుడు కొత్తగా కొన్ని ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా వానిష్ మోడ్‌ ను ప్రవేశపెట్టింది మెసెంజర్. ఈ వానిషింగ్ మెసేజ్ లకి ఒకప్పుడు స్నాప్‌ చాట్ ఫేమస్ అని చెప్పచ్చు. కానీ ఇప్పుడు ఈ ఫీచర్ వాట్సాప్, టెలిగ్రామ్‌తో సహా అన్ని మెసేజింగ్ యాప్స్ లో అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ సెప్టెంబరులోనే వానిష్ మోడ్ ను ప్రకటించింది. ఇది ఇప్పుడు మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌కి కూడా తీసుకు వస్తోంది. దీని వినియోగదారులు చాట్ హిస్టరీలో ఉండకుండా మెసెంజర్ ద్వారా మెసేజ్ లను పంపడానికి అనుమతిస్తుంది.

ఈ ఫీచర్ ను మీరు వాదాలనుకుంటే కనుక మీరు ఇప్పటికే ఉన్న చాట్ థ్రెడ్‌పై స్వైప్ చేస్తే రెండవ స్వైప్ సాధారణ చాట్ మోడ్‌ కు తీసుకువెళ్తుంది. ఇక్కడ చాట్‌లో సీక్రెట్ మోడ్‌ను ఉపయోగించవచ్చని ఫేస్‌బుక్ చ్బెఉథిన్ది. అయితే ఇది గ్రూప్ చాట్‌లకు వర్తించదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మరో ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది వినియోగదారులు చూసిన తర్వాత అదృశ్యమయ్యే ఫోటోలు మరియు వీడియోలను పంపడానికి ఈజీగా ఉంటుంది. ఈ వానిష్ మోడ్‌ను చేర్చడం వల్ల దీని మెసేజింగ్ స్నాప్‌ చాట్‌ కి సమానంగా ఉంటుంది. ఇక ఇన్‌స్టాగ్రామ్ కూడా టిక్ టాక్ లాంటి రీల్స్ అంటూ ఒక ఫీచర్ తీసుకొచ్చింది.

ఇలా రోజూ సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లో మరింత ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది ఫేస్ బుక్. ఇక భారత్ వినియోగదారులకు దీపావళి వేడుకలను మరింత ఉత్సాహపరిచేందుకు ఫేస్‌బుక్ దీపావళి అవతార్ లతో సహా పలు కొత్త ఫీచర్లను విడుదల చేసింది. “పండుగ ఉల్లాసాన్ని ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేయాలనే” లక్ష్యంతో వీటిని రిలీజ్ చేసామని పేర్కొంది. ఈ కరోనా టైంలో చాలా మంది వినియోగదారులు తమ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను కలవలేరు. ఈ ఫీచర్ తో అవతార్‌ ను రెడీ చేసి మీమీ సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులను అలరించవచ్చని పేర్కొంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: