మానవ మనుగడకు టెక్నాలజీ అభివృద్ధి చెందడం అవసరమే, ఈ టెక్నాలజీ వలన మనము ఈ రోజు ఎన్నో వనరులను సంతోషంగా అనుభవిస్తున్నాము. అయితే ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మనము రోజూ టీవీలోనో, వార్త పత్రికలలోనూ చూస్తూ ఉంటాము. నా అకౌంట్ లో డబ్బు మాయమైపోయింది అని, లేదా ఎటిఎం కార్డు ద్వారా అమౌంట్ డ్రా చేసినట్లు మెసేజ్ రావడం లాంటివి జరుగుతుండడం మనము గమనించి ఉంటాము. ఇవన్నీ కూడా ఆన్లైన్ మోసాల కిందకు వస్తాయి. ఇలా ఎంతోమంది అనేక రకాలుగా నష్టపోతున్నారు. ఇటీవల మైక్రోసాఫ్ట్ జరిపిన సర్వేలో కొన్ని విషయాలు తెలిశాయి. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో కల్లా భారతదేశానికి చెందిన వారే ఎక్కువగా ఈ ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.

వీరు కొన్ని విషయాలను వెల్లడించారు. మిగతా దేశాల వారి కన్నా ఇండియన్స్ మాత్రమే ఆన్లైన్ మోసాల బారిన పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట, దాదాపుగా 69 శాతం మంది ఆన్లైన్ సేవలను వినియోగిస్తున్న వారు ఈ ఆన్లైన్ స్కామ్ లను ఎదుర్కొన్నట్లు మైక్రోసాఫ్ట్ 2021 గ్లోబ్ టెక్ సపోర్ట్ స్కామ్ రీసర్చ్ ద్వారా తెలిపింది.  ఇందులో 48 శాతం మంది ఆన్లైన్ స్కామ్ లో ఇరుక్కోగా, 31 శాతం మంది ఇండియన్స్ ఈ ఆన్లైన్ స్కామ్ ద్వారా డబ్బును   పోగొట్టుకున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా ఎక్కువ కావడం గమనార్హం. ఈ ఆన్లైన్ స్కామ్ ల గురించి ప్రతి నెల అందుతున్న ఫిర్యాదుల సంఖ్య 6500 గా ఉంది. వీరి నివేదిక ప్రకారం ఇండియన్ ఆన్లైన్ వినియోగదారులు 2021 సంవత్సరంలో 15,334 రూపాయలు పోగొట్టుకునట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపుగా 88 శాతం మంది తిరిగి వెనకు డబ్బును పొందగలిగారని ఈ నివేదిక తెలిపింది.  


ఎక్కువగా ఈ స్కామ్ వలన నష్టపోతున్న  పురుషుల కన్నా స్కామ్ చేసే పురుషుల శాతమే ఎక్కువ అని తెలుస్తోంది.  ఈ పురుషులలో 73 శాతం మంది వారి డబ్బును నష్టపోతున్నారు. అంతే కాకుండా ఈ ఆన్లైన్ స్కామ్ చేసే వారు కేవలం 24 నుండి 37 సంవత్సరాల వయసున్న వారినే టార్గెట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్స్ ఎక్కువగా ఈ స్కామ్ బారిన పడడానికి కారణం. స్కామ్ లు చేసే వారు చేసే కాల్స్ కు రెస్పొంద్ అవడమే అని తెలుస్తోంది. మిగతా దేశాల వారు ఈ స్కామ్ కాల్స్ ను స్వీకరించరు. అందుకే ఇండియన్స్ ఎక్కువగా ఈ స్కామ్ ల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బును కోల్పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: