ఇండియాలో ఇంధన ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తోంది.. మైలేజ్ తోపాటు బైక్ కండీషను కూడా బాగుండే బైకుల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కస్టమర్లు.. ఈ మధ్య కాలంలో మహిళల తో పాటుగా పురుషులు కూడా ఎంతో మంది బైక్ డిజైన్, స్టైలిష్ లుక్ వంటివి కూడా ఎక్కువగా చూస్తున్నారు. అటువంటి టూవీలర్లు గత నెల జనవరి లో అత్యధిక స్థాయిలో కొనుగోలు చేయడం జరిగింది.కేవలం ఒక నెల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా ఈ బైకులు అమ్ముడు పోయాయట. ఇంతకీ ఆ బైక్ ఏమిటో కాదు "HERO SPLENDOR PLUS" . దేశ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన బైక్ లలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక ఈ బైక్ ధర కాస్త తక్కువే అయినప్పటికీ స్టైలిష్ గా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్ పోస్తే..80 KMPL మైలేజ్ వస్తుందని కంపెనీ సంస్థ తెలిపింది. ఆటోమొబైల్ గణాంకాల డేటా ప్రకారం.. ఈ ఏడాది ఎక్కువ శాతం అమ్ముడుపోయిన బైకులు ఇవే అని తెలుస్తోంది.ఇక అంతే కాకుండా కంపెనీ 97.2 సీసీ ఇంజన్ ను అందించింది.. ఇక ఇది ఫ్యుయల్ ఇంజక్షన్ టెక్నాలజీ పై కూడా ఆధారపడి పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ బైకు ప్రారంభ ధర రూ.65,610 ఎక్స్ షోరూమ్ ధర ఉండగా .. ఇక టాప్ వేరియంట్ బైక్ ధర ప్రస్తుతం రూ.70,790 వరకు ఉంటుంది.. ఇక 2021 జనవరి నెలలో ఈ కంపెనీ సుమారుగా 2,25,383 యూనిట్లను అమ్మడం జరిగింది అంటే జనవరి 2021 సంవత్సరం జనవరి 2022 లో అమ్మకాలు కొంచెం తక్కువ అని చెప్పవచ్చు.. ఇకపోతే ఈ బైక్ కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉండడం వల్ల దేశంలో ఎక్కువమంది ఈ బైక్ ను కొనడానికి ఇష్టపడుతున్నారు.. అందుకే హీరో స్ప్లెండర్ ప్లస్ రికార్డు సృష్టించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: