అందులో చాట్, డయల్ ఇంకా అలాగే యాడ్ కాంటాక్ట్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. దీంతో యూజర్ సదరు ఫోన్ నంబర్ కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేయకుండానే ఈజీగా చాట్ చేయొచ్చు. అలానే డయల్ ఆప్షన్ ద్వారా సదరు వ్యక్తికి కూడా ఈజీగా కాల్ చేసి మాట్లాడొచ్చు.గతంలో వాట్సాప్‌లో చాట్ చేయాలంటే ఫోన్ నంబర్ తప్పనిసరిగా కాంటాక్ట్స్ లిస్ట్ లో సేవ్ చేసుకోవాల్సిందే. త్వరలో తీసుకురానున్న పాప్-అప్ మెనూ అప్‌డేట్‌తో ఈ ప్రక్రియ చాలా ఈజీ కానుంది. అలాగే ఇక వాట్సాప్ వ్యూవన్స్ ఫీచర్‌ను త్వరలోనే విండోస్ యూజర్లకు కూడా పరిచయం చేయనుంది.ఇక ఇవే కాకుండా వాట్సాప్ ఆండ్రాయిడ్ ఇంకా ఐఓఎస్ యూజర్లకు 37 కొత్త ఎమోజీలను పరిచయం చేయనుంది. ఇందులో మెల్టింగ్ ఫేస్, ఆఫ్ ఫేస్ సెల్యూట్ ఇంకా అలాగే డాటెడ్ లైన్ ఫేస్ ఇలా దాదాపు 37 ఎమోజీలు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి