పల్సర్ 125 ,150 నిలిచింది.
ఇక ఎక్కువగా ఎగుమతి మార్కెట్ విషయానికి వస్తే పల్సర్-160,-180,200 వంటివి బాగా అమ్ముడు పోతున్నాయి. పల్సర్ భారీ మోడల్స్ గురించి మాట్లాడుతూ కంపెనీ ఇప్పటి వరకు..F250,N250 వంటి మోడల్స్ విడుదల చేశారు. ఇప్పుడు పల్సర్ మరొకసారి కొత్త మోడల్-N160 బైక్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్ జూన్ నెల ఆఖరి లో కంపెనీ మోడల్‌ను విడుదల చేస్తున్నట్లుగా తెలియజేసింది. ఈ బైక్ చూడడానికి స్టైలిష్ పరంగా బాగానే ఉన్నప్పటికీ..N250 బైక్ ను పోలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సరి కొత్త మోడల్ కంపెనీ ఎలాంటి మార్పులు చేసిన ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). ఈసారి ఈ కొత్త పల్సర్ N250 బైకును స్పోర్ట్ లుక్కులో తీసుకు రాబోతోంది.
2). ఈ మోడల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్ ను కూడా మనకు బజాజ్ కంపెనీ వారి అందిస్తున్నారు.
3). డిజైన్ మరింత అందంగా ఉండడానికి...LED DRL ను ఎంతో అందమైన ఆకృతి తో ఉండేలా చూస్తున్నారట.
4). లుక్స్ పరంగా ఈ బైక్..N250 మాడల్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయట.
5). బైక్ లోని సీట్ డిజైన్, గ్రాబ్ రైల్స్, టేయిల్ సెక్షన్, రియర్ వ్యూ మిర్రర్స్, తదితర వాటిని దాదాపుగా N250 బైక్ ను పోలి ఉంటాయట.