భారత టెలికాం రంగంలో బాగా ప్రజాదారణ పొందిన ఎయిర్టెల్ టెలికాం అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా తమ కష్టమర్ల ఆర్థిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడం గమనార్హం.  ఈ క్రమంలోని ఎక్కువ డేటా ప్రయోజనాన్ని కలిగి ఉండే ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ముఖ్యంగా ఎక్కువ కాలం వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.. వీటితోపాటు మరికొన్ని ఎయిర్టెల్ టెలికాం రోజువారి డేటాను కలిగి ఉన్న ప్లాన్లు కూడా తీసుకురావడం గమనార్హం.ఇకపోతే ఈ ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాల్స్ అలాగే ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా ఉండనున్నాయి.  84 రోజుల వ్యాలిడిటీ సదుపాయం ఉన్న ఈ ప్లాన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.719 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు..
ఈ ప్లాన్ ద్వారా మీకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.  వీటితోపాటు ప్రతిరోజు 1.5 జిబి డేటా.. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందవచ్చు . ఈ ప్లాన్ ద్వారా పూర్తిగా మీరు 126 జీబీ ,అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ను పొందుతారు.

రూ.779 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్..
ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజులు అంటే మూడు నెలల పాటు మీరు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1.5 జిబి డేటా పొందుతారు . ఎయిర్టెల్ తో సహా ఇతర నెట్వర్క్ లకు అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కూడా పొందుతారు. మొత్తం కాలవ్యవధిలో 90 జిబి డేటా లభిస్తుంది.

రూ.839 ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్..
ఈ ప్లాన్ మీకు 84 రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 2gb డేటా అలాగే 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందుతారు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందించే ఈ ప్లాన్ మీకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సౌకర్యాన్ని కూడా కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: