ఇటీవల కాలంలో టెక్నాలజీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ టెక్నాలజీ వల్ల ప్రతి పని సులభతరంగా మారిపోయింది. దీంతో సామాన్యుడు సైతం సంపన్నుడిలా జీవితాన్ని గడిపే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు డబ్బున్న వారు మాత్రమే కావాల్సినవన్నీ కూడా కూర్చున్న చోటికి తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు సామాన్యుడు సైతం టెక్నాలజీని ఉపయోగించుకొని కావాల్సిన ప్రతీది కూడా కూర్చున్న చోటుకే తెప్పించుకోగలుగుతున్నాడు అనడంలో సందేహం లేదు.


 ఇక ఇప్పుడు ఏం కావాలన్నా ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు అన్నింటినీ కూడా ఇంటి ముందుకే డెలివరీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి  అయితే ఇలాంటి టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయిన జనాలు అవసరానికి మించి మరి టెక్నాలజీ మీద ఆధారపడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇక కొన్ని కొన్ని సార్లు టెక్నాలజీని నమ్ముకుంటే చేదు అనుభవాలు ఎదురవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఏకంగా ఆన్లైన్లో కావాల్సిన వస్తువులు ఆర్డర్ చేస్తే మరో వస్తువు డెలివరీ అవ్వడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.


 ఇక ఇప్పుడు వెలుగు చూసిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే. ఆన్లైన్లో ఎంతో ఇష్టంగా హెడ్ ఫోన్స్ ఆర్డర్ పెట్టాడు సదరు వ్యక్తి. ఆర్డర్ డెలివరీ అయింది. ఇక ఎంతో ఆత్రుతగా ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అతను హెడ్ ఫోన్స్ ఆర్డర్ చేస్తే టూత్ పేస్ట్ వచ్చింది. ఓజా అనే వ్యక్తి ఏకంగా 1990 రూపాయల విలువైన సోనీ వైర్లెస్ హెడ్ ఫోన్స్ అమెజాన్ లో ఆర్డర్ చేయగా ఏకంగా పార్సెల్ లో టూత్ పేస్ట్ వచ్చింది. ఇక దీనిని ఫిర్యాదు చేయగా అమెజాన్ క్షమాపణ కోరింది. విచారణ చేసి ఆర్డర్ చేసిన వస్తువును ఇంటికి పంపుతాం అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: