వాట్సాప్ : డిలీటయిన మెసేజెస్ ఇలా చూసేయొచ్చు ?


ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని కోట్లాది మంది వాట్సాప్ ని ఉపయోగిస్తుంటారు. దీంతో మెసేజ్ లు, ఫొటోలు, వీడియోలు చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో కాలింగ్, వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.వినియోగదారుల దృష్టిలో ఉంచుకుని వాట్స్ యాప్‌లో అనేక ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఫీచర్‌లు కూడా అందించబడ్డాయి.ఇక అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్. దీని కారణంగా, రిసీవర్, పంపిన వారి చాట్‌ల నుండి మేసేజ్ లనేవి డిలీట్ అయిపోతాయి.డిలీట్ అయినా కూడా మేసేజ్ ల జాడ కనిపిస్తుంది. ఆ మేసేజ్ లు పంపబడినట్లు, తొలగించబడినట్లు చూపుతుంది. చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లలో ఏముందో తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తారు. అయితే దీని కోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరం. అందువల్ల Android ఫోన్‌లలో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ లను ఈజీగా చదవవచ్చు.తొలగించబడిన టెక్స్ట్ మెసేజ్ లని దీని ద్వారా చెక్ చేయవచ్చు.అయితే ఈ ఫీచర్ ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు. అలాగే, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 11, అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది.డిలీట్ అయిన మెసేజ్ లను చదవడానికి  ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.ఆ తర్వాత నోటిఫికేషన్‌లపై నొక్కండి.ఇక దీని తర్వాత మరిన్ని సెట్టింగ్‌లకు(More settings) వెళ్లండి.ఆ తరువాత నోటిఫికేషన్‌ల చరిత్రకు(Notifications history) వెళ్లండి.ఇక అక్కడ స్క్రీన్‌పై కనిపించే టోగుల్‌ను ఆన్ చేయండి.ఇంకా ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత, మీరు మళ్లీ Notifications ద్వారా నోటిఫికేషన్‌ల హిస్టరీకి వెళ్తారు. దీని ద్వారా మీరు 24 గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ లను ఈజీగా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: