
అయితే జాతీయ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జూలై 15 నుంచి నేషనల్ హైవేల పైన కూడా ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజ్ అనేది వసూలు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఇందుకు సంబంధించి ఇంకా కేంద్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు.ఒకవేళ ఇది అమలులోకి వస్తే కార్లు ఇతర పెద్ద వాహనాల తరహాలోనే ఇకమీదట ద్విచక్ర వాహనాలకు కూడా ఫాస్ట్ ట్యాగ్ చేయించుకోవలసి ఉంటుంది. వీటి ద్వారానే ఇక మీదట టోల్గేట్ చెల్లించాల్సిన అవసరం ఉంటుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తే.. సామాన్యుల నుంచి చాలా వ్యతిరేకత వస్తుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి..దీని తర్వాత కూడా చాలామంది రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే వాహనాల మీద వస్తున్న టోల్ ఫీజు ఎన్నో ఏళ్ల తరబడి నుంచి టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి తీసుకుంటూనే ఉన్నారని ఇప్పటికే వాహనదారులు గగోలు పెడుతున్నారు.. మరి ఇలాంటి సమయంలో టూ వీలర్లకు కూడా ఇకమీద టోల్ ప్లాజా అంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి. మరి ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పైన కూడా అధిక ధరలో ఉండడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సమయంలో టూ వీలర్లకు కూడా టోల్ ప్లాజా అంటే బైక్ నడపాలంటే భయపడే పరిస్థితిలో కనిపిస్తున్నారు.