
పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు.. పాఠ్య పుస్తకాలలో ఉన్న అమరావతి పాఠ్యాన్ని తొలగించి నది. ఈ మేరకు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి అధికారులు అధికారికంగా తెలియజేయడం జరిగింది.2021-2022 విద్యా సంవత్సరం ఆలస్యం ప్రారంభం కావడంతో విద్యార్థులపై ఎక్కువ సిలువస్ భారం కాకూడదనే ఉద్దేశంతోనే విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. ఇక అమరావతి తో పాటుగా మరికొన్ని పాఠాలకు సంబంధించి సిలబస్లో కూడా తొలగించినట్లు తెలియజేయడం జరిగింది. అయితే ఇలా సిలబస్ ను తొలగించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. విద్యార్థుల పై ఎక్కువ భారం మోపకూడదని ఉద్దేశంతోనే ఈ పుస్తకం చివర్లో ఉన్న పాఠాలను తొలగిస్తారు కానీ.. పాఠ్యపుస్తకంలో రెండవ భాగమైన అమరావతినీ ఎలా తొలగిస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
కాగా ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి విద్యార్థులకు ఫ్రీ పబ్లిక్ పరీక్షలు కూడా జరుగుతున్న నేపథ్యంలో.. అమరావతి, వెన్నెల పాఠాలు తప్ప మిగిలిన పాటలు చదువుకుని.. విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావాలని ఉపాధ్యాయులు సూచించడం జరిగింది. ఏది ఏమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం చేసిన ఈ విషయంపై విద్యార్థులు కాస్త ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు. అమరావతి పాఠాన్ని తొలగించడం వెనక ఆంతర్యం ఏదైనా దాగి ఉందా అని మరికొంతమంది ఆరాలు తీస్తున్నారు. ఇకపోతే ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో.. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..