ఈ లోకంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు. ఇటీవల కాలంలో ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఈడైలాగ్ కేవలం సినిమాకు సంబంధించినది అయినప్పటికీ అటు నిజంగా నిజజీవితంలో తల్లి ప్రేమకు సరిగ్గా సరిపోతూ ఉంటుంది అని చెప్పాలి. సాధారణంగా ఆడది అబల అని అంటూ ఉంటారు ఎంతోమంది. కానీ తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డను కాచుకునే తీరులో చూస్తే ఒక యోధురాలు కనిపిస్తూ ఉంటుంది.. తనకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే తనకు పుట్టిన పిల్లలకు మాత్రం ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటుంది తల్లి.


 ఒకవేళ తన పిల్లలకి ఏదైనా కష్టం వస్తుంది అని తెలిస్తే చాలు ఆ కష్టాన్ని ముందుండి ఎదుర్కొంటుంది అని చెప్పాలి. ఇక మృత్యువు దూసుకు వస్తున్న  తన ధైర్యంతో తరిమికొట్టే సాహసం చేస్తుంది అని చెప్పాలి. అందుకే ఈ లోకంలో మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా ఇక తల్లి ప్రేమకు మాత్రం ఏదీ సాటి రాదు అని చెబుతూ ఉంటారు అని చెప్పాలి. అందుకే తల్లి బిడ్డల మధ్య ఉన్న బంధాన్ని మాటల్లో వర్ణించడం చాలా కష్టం అని చెప్పాలి. ఇక తల్లి బిడ్డల మధ్య బంధం ఎంత గొప్పగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసేలా ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోయాయి.


 అయితే తల్లి బిడ్డల బంధానికి కేవలం మనుషులే కాదు జంతువులు కూడా ప్రతీకగా నిలుస్తాయి. ఇక ఇటీవలే ట్విటర్ వేదికగా వైరల్ గా మారిపోయిన వీడియో చూసుకుంటే తల్లి ప్రేమ ముందు ఏకంగా మృత్యువు సైతం వనికిపోయింది అని చెప్పాలి. అడవుల్లో ఉండే ప్రమాదకరమైన జంతువుల్లో చిరుత పులి కూడా ఒకటి. ఎంతో వేగంగా వేటాడుతూ ఉంటుంది. అయితే ఇటీవలే ఒక అడవి పంది పిల్లను వేటాడింది చిరుత. ఇలాంటి సమయంలో చిరుత పులి చేతిలో ప్రాణాలు పోతాయి అని తెలిసినప్పటికీ కూడా తల్లి తన బిడ్డను కాపాడేందుకు ఏకంగా చిరుత పులిపైన దాడి చేసేందుకు ప్రయత్నించింది. చివరికి పులి రూపంలో ఉన్న మృత్యువు సైతం భయంతో పరుగులు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: