ఈ ప్రపంచంలో కల్మషంగా బ్రతికేది ఒక మనిషి మాత్రమే.. ఇలా మోసాలు చేస్తే గాని బ్రతకలేమనే భ్రమలో బంధిగా మారిన మానవులు తమ స్వార్ధం కోసం ఎన్నో ఘోరాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. కానీ మనిషితో పాటుగా ఈ పుడమి పై సృష్టించబడిన ఏ ప్రాణి కూడా మానవుల్లా ఆలోచించలేదు.. ద్వేషంతో బ్రతకలేదు.. ఇక తన ఆనందం కోసం ఎన్నో ప్రాణులను పంజరాల్లో గానీ బోనుల్లో గానీ బంధించి ఆనందిస్తున్న మనుషులు వాటి స్వేచ్చను హరిస్తున్నారన్న విషయం మరచిపోతున్నారు.. ఒకవేళ మనిషినే అలా బానిసను చేస్తే జీవించగలడా.. లేదు కదా.. అంటే చూడండి ఇక్కడ మనిషికున్న స్వార్ధం సృష్టంగా కనిపిస్తుంది..

 

 

ఇకపోతే సర్వసాధారణంగా కొందరు వారింట్లో చిలుకలను పెంచుకుంటారు.. నిజానికి జంతు ప్రేమికుల ఇళ్లల్లో ఉన్నంత స్వేచ్చ, వాటిని టైం పాస్‌కు పెంచుకునే వారింట్లో ఉండదు.. ఇక జంతు ప్రేమికులైతే వాటిని చాలా జాగ్రత్తగా చూసు కుంటారు, వారి కుటుంబంలోని సభ్యుల్లా ట్రీట్ చేస్తారు.. నిజానికి జంతువులకు, పక్షులకు ఉన్నంత విశ్వాసం మనిషికి లేదని ఎన్నో సందర్భాల్లో నిరూపించబడింది.. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఒక చిలుక ఏడుస్తున్న బుజ్జాయిని ఎంతో ప్రేమగా లాలిస్తూ, తన ఏడుపును ఆపాలని ప్రయత్నిస్తుంది.. ఇందుకు గాను అది చేస్తున్న ప్రయత్నం నెటిజన్స్‌ను విశేషంగా ఆకర్శిస్తుంది..

 

 

ఆ పాప ముక్కుపై సున్నితంగా తాకుతూ, నుదిటిపై ముద్దు పెడుతూ, ఏడవకురా కన్నా నేనున్నానుగా, అమ్మ వస్తుంది ఊరుకో, నాతో ఆడుకో అన్నట్లుగా ప్రవర్తించే ఆ చిలుక చేష్టలకు ముగ్ధులవని వారుంటారా.. అలా ఆ పసివాడి ఏడుపును ఎలాగోలా ఆపింది ఈ చిలుక.. ఇకపోతే చిలుకను ఆ బుజ్జాయి దగ్గర వదిలి పక్కనే ఆ పాప తల్లి ఉండి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టుచేయగా అది కాస్త వైరల్‌గా మారి అందర్ని విశేషంగా ఆకట్టుకుంటుందట..  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: