ఒక మహిళ మెదడులో సూదులు వున్నాయంట.. అవి ఆమె తలలోకి ఎలా వెళ్ళాయో ఆమెకే తెలీదంటా. ప్రస్తుతం ఈ ఘటన తెగ వైరల్ అవుతుంది. ఇండియా హెరాల్డ్ ఇస్తున్న వివరాల్లోకెళితే... చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో జెంగ్జౌలో నివసిస్తున్న జుహు అనే 29 ఏళ్ల మహిళ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు పెద్దగా గాయాలేమీ కాలేదు. అయితే, డాక్టర్లు ఒకసారి అన్నిరకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆమెకు సూచించారు. దీంతో సీటీ స్కాన్ చేయించుకుంది. ఆ రిపోర్ట్ చూసిన వైద్యులు షాకయ్యారు. ఎందుకంటే.. ఆమె మెదడులో 4.9 మిల్లీమీటర్ల పొడవున్న రెండు సూదులు కనిపించాయి. అయితే, అవి యాక్సిడెంట్‌కు సంబంధించిన గాయాలు కావు. ప్రమాదం కంటే ముందే.. ఎప్పటి నుంచో అవి ఆమె తలలో ఉన్నాయి.
అప్పుడు వైద్యులు ఆమెను గతంలో ఎప్పుడైనా ఆమెకు  సర్జరీ జరిగిందా లేదా అని అడిగారట. అందుకు ఆమె లేదని సమాధానం ఇచ్చిందిట  అలాగే తలకు ఏమైనా గాయాలు కావడం వంటివి చోటుచేసుకున్నాయా అనే ప్రశ్నకు కూడా ఆమె కాదనే సమాధానం చెప్పిందట. దీంతో.. ఆమెకు ఊహ తెలియని వయస్సులోనే ఎవరో వాటిని తలలోకి చొప్పించి ఉంటారని భావిస్తున్నారు. ఆ సూదులు పూర్తిగా మెదడులోకి వెళ్లిపోయాయి. పుర్రె మీద వాటిని చొప్పించిన ఆనవాళ్లు కూడా ఏమీ లేవు. దీంతో ఆ సూదులు ఆమె మెదడులోకి ఎలా ఎలా వెళ్లాయో తెలీక వైద్యులు సతమవుతున్నారట.

జుహు తల్లిదండ్రులను అడిగితే ఆమెకు చిన్నపట్నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పారట. వారు యాత్రలకు వెళ్ళినప్పుడు జుహును తమ బంధువుల ఇంట్లో పెట్టి వెళ్లారట. అప్పుడు వారి బంధువుల్లో ఒకరు అయినా జుహు పిన్ని జుహు కి తలపై రెండు నల్లని మచ్చలు కనిపించాయని జుహు తల్లిదండ్రులకు చెప్పిందట.మాములు మచ్చలే కదా అని ఆమె తల్లిదండ్రులు పట్టించుకోలేదట. సీటీ స్కాన్ రిపోర్టులతో జుహు పోలీసులను ఆశ్రయించింది. తన తలలోకి ఎవరో సూదులు చొప్పించారని, దీనిపై విచారణ జరపాలని కోరింది. కొద్ది రోజుల కిందట చైనా వైద్యులు తీవ్ర తలనొప్పితో బాధపడుతున్న మహిళ మెదడు నుంచి ఆరు ఇంచుల బతికున్న పురుగును బయటకు తీశారు. పూర్తిగా ఉడకని మాంసం తినడం వల్ల పురుగులు రక్తం నుంచి మెదడులోకి చేరాయని వైద్యులు తెలిపారు.

ఈ విధంగా ఇలాంటి చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతూ వైరల్ అవుతూ ఉంటాయి.ప్రస్తుతం ఈ వార్త కూడా ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: