ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోస్ కి పోటీగా పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోస్ సరసన నటించి రికార్డు స్థాయిలో ఎన్నో హిట్స్ అందుకుంది సమంత. అలాగే సమంత సామాజిక సేవలలో కూడా ముందు ఉండి పేద వారికి తనవంతు సాయం చేస్తూ ఉంటుంది.  తన కో యాక్టర్ అక్కినేని నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. పెళ్ళైన కాని నటనకు ప్రాధాన్యత వున్న సినిమాలు చేసుకుంటూ తానేంటో నిరూపించుకుంటుంది సమంత. సోషల్ మీడియా లో అభిమానులతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. 


ఇక  ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మగ వారికి పోటీగా ఎన్నో కష్టమైనా వర్క్ ఔట్లు చేస్తుంది. ఇక ఈ హాట్ బ్యూటీ "సామ్ జామ్" చేస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఆ షో కోసమే సమంత చాలా కష్టపడి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంది.ఆ  విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వని సమంత.. ఇటీవల Plant-Based Diet మరియు దానికి సంబంధించిన వర్కౌట్స్ ను ప్రారంభించింది. నిపుణుడైన కృష్ణ వికాస్ పర్యవేక్షణలో సామ్ ఈ కఠిన వ్యాయామాలు చెయ్యడం మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: