ప్రస్తుతం కరోనా తో ప్రపంచం అతలాకుతలం అవుతుంది.ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో కేసులు నమోదు అవుతున్నాయి.ఇదిలా ఉండగా కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకొని మరో కొత్త వైరస్ కు జీవం పోసింది.ఈ కొత్త కరోనా వైరస్ యూరప్‌ దేశాలలో మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కొత్త రూపం ప్రస్తుతం ఉన్న కోవిడ్ వైరస్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ యూరప్ ధేశాలు చెబుతున్నాయి. బ్రిటన్‌ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఈ వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చే వరకు, కొన్ని నెలలపాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.

ఇదిలా ఉండగా ఈ కొత్త రకం కరోనా వైరస్ కు మందు తమ వద్ద ఉంది అంటూ రష్యన్ సైంటిస్టులు ప్రకటించారు.  తాము అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ ఈ కొత్తరకం కరోనా వైరస్ ను ఎదుర్కొనగలదని (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ డిమిట్రీవ్ ధీమా వ్యక్తం చేశారు. తమకున్న సమాచారం ప్రకారం యూరప్‌లో వెలుగు చూసిన కొత్త రకం కరోనా స్ట్రైన్‌పై స్పుత్నిక్‌-వి ప్రభావంతంగా పనిచేస్తుందని చెప్పారు.కొవిడ్-19 కొత్త మ్యుటేషన్ స్ట్రైన్‌ను ఎదుర్కొనేందుకు ఆస్ట్రాజెనెకాతోపాటు మరో వ్యాక్సిన్ తయారీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నట్టు డిమిట్రీవ్ పేర్కొన్నారు.

 స్పుత్నిక్-వి టీకా 95 శాతానికి పైగా ప్రభావంతంగా పనిచేస్తున్నట్టు గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ టీకా 96-97 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఆరోగ్య నిపుణులను కూడా దృవీకరిస్తున్నారని రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది. ఆగస్టు 11న స్పుత్నిక్-వి టీకాను రష్యా రిజిస్టర్ చేసింది. ఫలితంగా కరోనా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా రష్యా రికార్డులకెక్కింది.మరి ఈ టీకా ప్రపంచ దేశాలకు ఎప్పుడు సరఫరా అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: