ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..వయసులో వున్న ప్రతి యువకునికి ఒక గర్ల్ ఫ్రెండ్ వుండాలని ఆశ. కాని కొంతమంది సింగిల్ గా వుంటారు. అలాంటి సింగల్ కోవకు చెందిన ఓ యువకుడు ఏం చేసాడంటే ఈ న్యూస్ చదవాల్సిందే... తైవాన్ యూనివర్శిటీలో చదువుతున్న చెన్ అనే యువకుడు ‘లవ్ యాక్టింగ్-ఎక్స్‌ట్రా’ అనే సంస్థ వద్ద ఓ యువతిని ప్రేయసిగా అద్దెకు తెచ్చుకున్నాడు. మూడు గంటల సేపు ఆమె.. అతడికి గర్ల్‌ఫ్రెండ్‌గా నటించేందుకు 7,200 తైవాన్ డాలర్లు (రూ.19 వేలు) చెల్లించాడు. ఈ సందర్భంగా ఆ సంస్థ నింబంధనలను అంగీకరిస్తూ సంతకాలు కూడా చేశాడు.నియమ నిబంధనలు ప్రకారం.. అతడు తన అద్దె గర్ల్‌ఫ్రెండ్‌ చేయి పట్టుకోవచ్చు. తలను నిమరవచ్చు, కౌగిలించకోవచ్చు కూడా. అయితే, ఇవన్నీ వారు రూల్స్‌లో తెలిపిన విధంగానే చేయాలి.

అయితే, ఆమెను ముద్దు పెట్టుకోవడానికి గానీ, శరీరంపై ఎక్కడిపడితే అక్కడికి చేతులు వేయడానికి గానీ చెయ్యకూడదు. ఈ నిబంధనలకు అంగీకరించి చెన్ తైపై మెయిన్ స్టేషన్ వద్ద తన అద్దె గర్ల్‌ఫ్రెండ్‌ను కలిసి ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. అప్పటివరకు అంతా ప్రశాంతంగానే  గడిచింది.కాని మధ్యాహ్నం భోజనం తర్వాత షికారు కోసం ఆమెను డాన్ ఫారెస్ట్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మనోడు ఇక తట్టుకోలేక ఆమెతో అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘నేను నిన్ను కిడ్నాప్ చేస్తా’’ అంటూ ఆమె శరీరాన్ని తడమడం మొదలుపెట్టాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్ ఆమె తొడలు మీద చేతులు వేశాడు. ఆమె షర్ట్‌ బటన్లు విప్పాడు. ఆ తర్వాత ఆమె పిరుదులను తాకాడు. ఒప్పందంలో వున్న అన్ని నిబంధనలు అతిక్రమించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆమె ఏం చేయలేకపోయిందట.ఇక ఆమె టైం బాగుండి అదృష్టవశాత్తు మూడు గంటలు గడిచాయి.

దీంతో చెన్.. ఒప్పందం ప్రకారం ఆమెను వదిలిపెట్టాడు. ఆ వెంటనే ఆమె నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెన్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆమెకు క్షమాపణలు తెలుపుతూ చెన్‌తో లేఖ కూడా రాయించారు. కోర్టు అతడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 1,80,00 తైవాన్ డాలర్లు (రూ.4,69,696) జరిమానా విధించింది.ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలాంటి మరెన్నో వైరల్ న్యూస్ ల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: