ఏపీ ప్రభుత్వం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి  వైయస్ జగన్ తన పాలనలోని ప్రజలకు సుభిక్షమైన అవకాశాలను కల్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందులో భాగంగానే  ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి. మొత్తం సచివాలయ వ్యవస్థ అంతా వాలంటరీల మీదే ఆధారపడి ఉంది. వాలంటరీ లకు గౌరవ వేతనం కింద నెల నెలా రూ.5000మాత్రమే ఇస్తుంది. ఇక మీదట రూ.5000 తో పాటు కీలకంగా పని చేస్తున్న వాళ్లకు సత్కారాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.


అయితే వాలంటరీలకు సత్కార విషయంలో కొన్ని అర్హతలను విధించారు. ఈ అర్హతలను మూడు కేటగిరీలుగా ఎంపిక చేయనున్నారు.

లెవెల్ -1 ఏడాది పాటు సేవలందించిన వాలంటరీ లకు వారికి సేవ మిత్రా తో పాటు బ్యాడ్జి తో పాటు రూ. 10000 బహుమానంగా ఇవ్వనున్నారు.

లెవెల్ -2 లో ప్రతి మండలం లేదా పట్టణంలో ఐదుగురు చొప్పున ఎంపిక చేసి వీరికి సేవ రత్న తో పాటు స్పెషల్ బ్యాడ్జి తో పాటు -రూ. 20,000 ను బహుమానంగా ఇవ్వనున్నారు..

లెవెల్ -3 లో ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున ఎంపిక చేసి, వీరికి సేవా వజ్రాల పేరిట స్పెషల్ బ్యాడ్జి తో పాటు రూ. 30,000 లను బహుమానంగా ఇవ్వనున్నారు.


వాలంటీర్లు ప్రజలకు చేస్తున్న సేవకు గాను,  సీఎం జగన్ వారికి గౌరవ వేతనంగా 5000 రూపాయలు ఇచ్చినప్పటికీ, ఇలాంటి మరికొన్ని పురస్కారాలను వారికి అందించి,  వారిని నైపుణ్య పథం వైపు నడపాలనే ఆకాంక్షతో ఇవన్నీ చేస్తున్నట్టు తెలుస్తోంది.. వాలంటీర్లు ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు మూలస్తంభాలు లాంటివారు. గ్రామం లోనే కాదు మండలంలో, నియోజకవర్గాలలోను వారు ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు.. ఇలాంటి వారిని తప్పకుండా గౌరవించాలి అనే ఆలోచనతో సీఎం జగన్ గారు ఇలాంటివి చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలాంటివి చేయడం వల్ల వారిని మరింతగా ప్రోత్సహించడమే కాకుండా వారికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: