ఒకప్పుడు ఆడవాళ్లు ఇంట్లో తప్ప బయట ఎలాంటి పనులు చేసేవారు కాదు. కేవలం ఇంటి పనులకే ఇంకా ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. కాని ఇప్పుడు అన్ని రంగాల్లో మగవాళ్ళ కంటే మగువలే ముందుంటున్నారని చెప్పాలి. ఇక ఇది 21 వ శతాబ్దం. ఇంకా ప్రత్యేకంగా ఈ జనరేషన్ గురించి చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ రోజుల్లో మహిళలు ప్రతి వృత్తిలోకి ప్రవేశిస్తున్నారు, మునుపటి శతాబ్దాలలో, వారికి పరిమితి లేదు. క్రీడల నుండి అంతరిక్షం వరకు, మహిళలు ఇవన్నీ చేయగలరని ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు, మిజోరాంకు చెందిన ఒక యువ మహిళా ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియా నెటిజన్స్ ఎంతగానో దృష్టిని ఆకర్షించింది. దానిలో ఏముంది వైరల్ అవ్వడానికి అనుకుంటున్నారా కాని ఈమె ఫుట్ బాల్ ఆడేది హై హీల్స్ వేసుకొని. అదే ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఫుట్ బాల్ ఎలాంటి ఆటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సాధారంగా షూస్ వేసుకొని మైదానంలో ఆడాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఏకంగా హై హీల్స్ వేసుకొని ఆడితే ఇంకెంత పెద్ద కష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ వీడియో చూసిన మిజోరాం క్రీడా మంత్రి రాబర్ట్ రోమావియా రాయ్టే బాగా ఇంప్రెస్ అయ్యి ఈ వీడియోని షేర్ చేశాడు. ఇక ఈయన షేర్ చేసిన ఈ వీడియో అందరిని ఆకర్షస్తూ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అయింది.



ఈ వీడియోలో, ఐజాల్ ఆధారిత సిండి రెమ్రూట్‌పుయి అమ్మాయిని సాధారణం హై హీల్స్ తో ఆడటం మనం చూడవచ్చు. అయితే, ఆమె ఫుట్‌బాల్ బ్యాలెన్సింగ్ చర్య ఆమె ఆట తీరు ఆ రాష్ట్ర మంత్రితో పాటు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.అంతేగాక ఇప్పుడు, ఈ వీడియో నెమ్మదిగా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుంది.NEFFEX  2018 లో హిట్ అయిన పాట గ్రేట్ఫుల్ ట్యూన్స్ తో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా ప్లే చేసుకొని ఈ అమ్మడు బంతిని హై హీల్స్ తో ఆడుతూ బ్యాలెన్స్ చేయడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను మొదట సిండి స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.ఇప్పుడు ఆ మంత్రి ట్వీట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి ఇక.


https://twitter.com/robertroyte/status/1400503032647884800?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: