ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 829.8 మీటర్లు కాగా.. రాత్రి సమయాల్లో దీనిపై వాణిజ్య ప్రకటనలు అద్భుతంగా డిస్‌ప్లే అవుతుంటాయి. ఈ అత్యంత ఎత్తైన భవనంపై రాత్రివేళల్లో మిరుమిట్లు గొలిపే లైట్స్ పై వాణిజ్య ప్రకటనలు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చాలా కిలోమీటర్ల వరకు ఈ వాణిజ్య ప్రకటనలు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఈ అద్భుతమైన భవనంపై 3 నిమిషాల పాటు ఒక యాడ్ ప్లే చేసినందుకు ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా? ఒకవేళ మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు.. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల సమయంలో బుర్జ్ ఖలీఫా పై 3 నిమిషాలపాటు మీకు సంబంధించిన యాడ్ ప్లే చేయదలచుకున్నారనుకోండి.. మీరు అక్షరాల యాభై లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు శనివారం లేదా ఆదివారం నాడు 3 నిమిషాల నిడివిగల అడ్వర్టైజ్మెంట్ బుర్జ్ ఖలీఫా పై ప్లే చేయాలనుకున్నారనుకోండి రూ.70 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంకో దిమ్మతిరిగే విషయం ఏమిటంటే.. ఈ భవనం పై ప్రకటన డిస్‌ప్లే చేయాలనుకుంటే 30 రోజులు ముందుగానే.. బుర్జ్ ఖలీఫా ఓనర్ అయిన ఎమర్ ప్రాపర్టీస్ ని సంప్రదించాల్సి ఉంటుంది. అనంతరం మనకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వారికి పంపించాలి. వారు మన ప్రకటనను క్షుణ్నంగా పరిశీలించి ఆ తర్వాత తమ భవనంపై డిస్‌ప్లే చెయ్యాలో లేదో నిర్ణయిస్తారు. ఒకవేళ భవనంపై ప్రకటన ప్రదర్శించే అనుమతి లభిస్తే వారాలను బట్టి 3 నిమిషాలకు లక్షల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఒక ప్రకటనను మూడు నిమిషాల పాటు ప్రదర్శించడానికి 50 లక్షల రూపాయలు తీసుకోవడం నిజంగా షాకింగ్ విషయమే.


సాధారణంగా మన భారతదేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్లలో రాత్రి వేళ 8 గంటల నుంచి 11 గంటల మధ్య సమయంలో 30 సెకండ్ల నిడివిగల ప్రకటన ఇవ్వాలంటే 50 వేల నుంచి 5 లక్షల రూపాయలు తీసుకుంటారు. ఈ లెక్కన చూసుకుంటే.. అత్యంత పాపులర్ అయిన ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానళ్లలో మూడు నిమిషాల నిడివిగల అడ్వర్టైజ్మెంట్ ప్రసారం చేసినందుకు 3 - 30 లక్షలు రూపాయలు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ టీవీ ఛానల్స్ కి రాత్రి సమయంలో వీక్షకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో మన ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెలరోజుల పాటు ప్రతిరోజు ఎనిమిది సార్లు 30-60 సెకండ్ల నిడివిగల ప్రకటన టీవీ ఛానల్లో ప్రసారం కావాలంటే 3 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పాపులారిటీని బట్టి ప్రకటనలకు అయ్యే ఖర్చు ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా బుర్జ్ ఖలీఫా ఇండియన్ పాపులర్ చానెల్స్ కంటే కాస్త ఎక్కువగానే డబ్బులు తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: