మనం ప్రతి రోజూ ఆహారంతో పాటు.. ప్లాస్టిక్ ను కూడా తింటున్నామని అని మీకు తెలుసా.కానీ ఈ విషయం చెబితే వింతగా అనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. మనం ప్రతిరోజు, ఎంత ప్లాస్టిక్ తింటున్నామో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి ప్లాస్టిక్ శరీరంలోకి వెళుతోందా అంటే అది ఎలా వెళ్తుందో ఇప్పుడు ఒక నివేదిక తెలిపిన ప్రకారం తెలుసుకుందాం.
ప్లాస్టిక్ అనేది ఎక్కువగా గాలి రూపంలో, నీటి రూపంలో ఆహారంలో కలిగి ఉంటుందట. ప్రతి వారం రోజుల్లో మనం 5 గ్రాముల మైక్రో ప్లాస్టిక్ ను తింటున్నట్లు గా సమాచారం. 5 గ్రాములు ప్లాస్టిక్ అంటే ఒక ఏటీఎం కార్డు తో సమానం. ఒక సంవత్సరానికి ఒక హెల్మెట్ తయారీకి ఎంత ప్లాస్టిక్ అవసరము అంతా మనం సంవత్సరానికి ప్లాస్టిక్ తింటున్నాము. ఇక 10 సంవత్సరాలు వచ్చేసరికి..2.5 కిలోల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ని తినే స్తున్నాం.
ఇక ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత ప్లాస్టిక్ తిన్నారు మీరు ఊహించుకోవచ్చు. పరిశోధకులు అంచనా వేసిన ప్రకారం మనం జీవితాంతం 20 కేజీల వరకు ప్లాస్టిక్ తింటున్నట్లు గా అంచనా వేస్తోంది. WWF పరిశోధకులు తెలిపిన ప్రకారం ప్లాస్టిక్ ఎక్కువగా తాగే నీరు, ఆహార పదార్థాల నుంచి మన శరీరం లోకి వెళుతుంది అన్నట్లుగా తెలియజేస్తోంది. ఇక అంతే కాకుండా మన చుట్టూ ఉండే గాలి లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది అన్నట్లుగా తెలుపుతోంది. దీనివల్ల మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నట్లుగా తెలియజేస్తున్నది.
జర్మనీ ప్రదేశంలో ఒక వ్యక్తి 38 కేజీల ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను కొనుగోలు చేస్తుంటారు. ఇక ఐరోపాలో అయితే సగటు మనిషి 24 కేజీల ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలను కొనుగోలు చేస్తుంటారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఆహారాలను తింటాము అంతే మొత్తంలో ప్లాస్టిక్ వాడకం కూడా పెరుగుతోంది. ఒక ప్లాస్టిక్ బాటిల్ పూర్తిగా స్నానం కావడానికి దాదాపుగా 110 సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ కవర్లు, పేపర్ నాశనం అవ్వడానికి ఐదు వందల సంవత్సరాలు పడుతుందట. ఈ ప్లాస్టిక్ పదార్ధాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి