చాలా మంది ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రపంచ రికార్డు సృష్టించిన రికార్డ్స్ సంపాదించుకుంటే ఇక వారి జీవితానికి ఎదురేలేదు అనుకుంటూ ఉండటం గమనార్హం. అంతేకాదు తాము సాధించిన సంగతులను వీడియోల రూపంలో చిత్రీకరిస్తూ వుంటారు.. ముఖ్యంగా ప్రపంచ రికార్డు సంస్థ అధికారులు కూడా ఇలాంటి వీడియోలను తమ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ని ఒక యువకుడు కేవలం అతి కొద్ది సెకన్లలోనే 3 వాటర్ బాటిల్స్ ను ప్లిఫ్ చేశాడు.బ్రెండన్ కెల్బీ  యువకుడు 3 ప్లాస్టిక్ బాటిల్స్ ను అత్యంత వేగంగా ఫ్లిఫ్ చేసి  ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్లాస్టిక్ బాటిల్స్ ను ఫ్లిప్  చేయడం అంత కష్టమైన పనేమీ కాదు.. చాలా సులభమైనది..కానీ ఇక్కడ ఈ అబ్బాయి మాత్రం కేవలం 2.09సెకండ్లలో 3 ప్లాస్టిక్ బాటిల్స్ ను ఫ్లిఫ్ చేసి రికార్డు సృష్టించాడు.ఇక ఈ బాటిల్‌ను ఫ్లిప్ చేయడం చాలా సాధారణ విషయంగా అనిపించ వచ్చు కానీ, దాన్ని ఫ్లిప్ చేయడంలో కూడా  టెక్నిక్‌తోపాటు ప్రాక్టీస్ కూడా అలాగే ఉండాలి. ఒకవేళ ఎంత ప్రాక్టీస్‌ చేసినప్పటికీ మనం సరిగా చెయ్యలేకపోతే బాటిల్ సరిగా నిలబడదు కదా . కానీ  బ్రెండన్  మాత్రం 3 వాటర్ బాటిల్స్‌ను వెంట వెంటనే కేవలం 2.09 సెకన్లతో ఫ్లిప్ చేసి అందరిని ఔరా అనిపించాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించడం తో ఇతడిని  గిన్నిస్ రికార్డ్ వరించింది.
ఇదివరకే మన  భారతీయ యువకుడు కూడా  60 సెకన్లలో అత్యధికంగా ప్లాస్టిక్ బాటిల్‌ను తిప్పి ప్రపంచ రికార్డును సృష్టిస్తే, దానిని2021 జనవరిలో బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అబూదాబి అనే ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న జోయెల్ మాథ్యూ  అనే ఒక స్టూడెంట్ తన కళ్లకు గంతలు కట్టుకుని  మరీ అమెరికన్ జోష్ హోర్టన్ నెలకొల్పిన నిమిషంలో 27 బాటిల్ ఫ్లిప్‌ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. ఇక మాథ్యూ కూడా తన కళ్ళకు  గంతలు కట్టుకుని కేవలం  500 మి.లీ నీటిని నింపిన ప్లాస్టిక్ బాటిల్‌ను కేవలం  60 సెకన్లలో 37 సార్లు ఫ్లిప్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: