కొంత మంది నేరస్థులు చాలా అంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. హత్యలు ఇంకా అత్యాచారాలు చేసినా.. తమకేమీ అసలు తెలీనట్లు వారు ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్నిసార్లు చివరకు ఏదో రకంగా వారు దొరికిపోతుంటారు.ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో ఓ స్త్రీ రైలు కోసం ఎదురు చూస్తోంది.ఆ రైలు దగ్గరికి వస్తుందనగా.. ఓ యువకుడు అకస్మాత్తుగా ఆమెను పట్టాల మీదకు తోసేశాడు.ఇక ఈ ఊహించని ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.బెల్జియం రాజధాని అయిన బ్రస్సెల్స్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ మీద రైలు కోసం ప్రయాణికులంతా కూడా ఎదురు చూస్తున్నారు.ఇక వారితో పాటూ ఓ మహిళ కూడా ఎంతగానో ఎదురుచూస్తోంది. ఆమె వెనుక ఓ యువకుడు అటూ ఇటూ తిరుగుతూ ఉండడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. 

అయితే అందరిలా అతను కూడా ఆ రైలు కోసం ఎదురు చూస్తున్నాడేమో అని అంతా అనుకుంటారు. అయితే తీరా ఆ రైలు దగ్గరికి వచ్చే సమయంలో ఆమెను వెనుక నుంచి పట్టాల మీదకు అతను తోసేశాడు. దీంతో అక్కడున్న వారంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అదృష్టవశాత్తు రైలును సడన్‌గా ఆపడంతో ఆమెకు ప్రాణాపాయం అనేది తృటిలో తప్పింది.ఇక దుండగుడిని అక్కడున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇక ఆ యువకుడికి ఆ మహిళకు ఎలాంటి సంబంధం వుందో ఇంకా ఆ యువకుడు ఆ మహిళని ఏ కారణంగా హత్య చెయ్యాలి అనుకుంటున్నాడో అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి..
  

https://twitter.com/Bruxelles_City/status/1482106862204076038?t=Qd-Gtqxiwumo59eT6i_zHw&s=19

మరింత సమాచారం తెలుసుకోండి: