ఆలోచన ఉండి, పట్టుదల వుంటే ఎంతటి కష్టమైనపని అయిన సులభంగా చెయొచ్చు.. కొందరు యువకులు చేస్తున్న కొన్ని ప్రయోగాలు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూన్నాయి. ఇప్పుడు ఒక యువకుడి ఆలోచన అందరి చేత ప్రశంసలు అందుకుంది. తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ తో అతను చేసిన అద్భుతం అందరినీ తెగ ఆకర్షించింది. బాటిల్స్ తో ఒక అద్బుతమైన ఇల్లు కట్టారు. ఇది బయట నుంచి చూడటానికి చాలా అందంగా ఉంది. అంతేకాదు చుట్టూ చెట్లను కూడా పెంచారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతూన్నాయి.
విషయానికొస్తె.. ఇప్పటివరకు మనం అత్యంత ఖరీదైన ఇల్లను, ఎన్నో ఫెసిలిటీస్ వున్న ఇంటిని చూసి ఉంటాము.. ఒక విధంగా చెప్పాలంటే డబ్బులు వుంటే ఏదైనా సాధించవచ్చు.. అందుకే ఇల్లు కట్టినోడు మహారాజు అని అంటారు. కేవలం బడ్జెట్ తో వున్న ఇల్లు మాత్రమే కాకుండా తక్కువ బడ్జెట్ తో కూడా నిర్మించిన ఇల్లను మనం చూసే ఉంటాము. అంటే డబ్బులు ఉన్న వాడు దర్జాగా ఇల్లను నిర్మిస్తారు.. లేని వాళ్ళు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా నిర్మిస్తారు. కానీ ఇలాంటి బాటిల్ ఇల్లను ఎప్పుడూ చూసి వుండరు.. ఒకసారి అదేంటో ఇప్పుడు ఒకసారి చేద్దాం..
ఒక బాలుడు పనికిరాని ప్లాస్టిక్ బాటిళ్లతో అది కూడా నివాసం యోగ్యంగా ఉండేలా ఇల్లు రూపొందించాడు..ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా అది నిజమే అద్భుతం అని ఒక్క మాట లో చెప్పాలి.ఇళ్లను నిర్మించేవాళ్ల సాయం కూడా తీసుకోకుండా ఒక బాలుడు ప్లాస్టిక్ బాటిళ్లతో ఇల్లుని నిర్మించాడు. పైగా భారత్‌లోని ఒక బాలుడు ఈ ఇల్లుని నిర్మించడం విశేషం. అంతేకాదు ఇటుక గానీ సిమెంట్ గానీ వినియోగించకుండా కేవలం ప్లాస్టిక్ బాటిళ్లతో రూపొందించాడు. పైగా ఈ ఇంట్లో, తలుపులు, కిటికీలు, లైట్‌లు కూడా ఏర్పాటు చేశాడు.. మట్టి తో ఇలా అద్బుతమైన ఇల్లు నిర్మించిన అతని ఆలోచన నిజంగా గ్రేట్ .. అందుకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి