దీంతో ఇంటర్ విద్యార్థులు చదువుతున్న వారు ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీలో ని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.. ఒక కాలేజ్ లో చదువుతున్న విద్యార్థులు మరొక కాలేజీలకు వెళ్లి అక్కడ పరీక్షలు రాయవలసిన పరిస్థితి తలెత్తింది.. ఇక దీంతో విద్యార్థులు ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా విచారణ జరిపిన తర్వాత ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానం పై ఇచ్చిన నోటిఫికేషన్ ని సస్పెండ్ చేయడం జరిగింది. అందుచేతనే పాత పద్ధతిలోనే విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి.
మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 22 వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు జరగనున్నాయి.. ఇక వీటి కంటే ముందుగా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఆయా కళాశాలల్లో నిర్వహించాలని కోరుతూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ఈ ప్రాక్టికల్ పరీక్షలను ఈ నెలలో నిర్వహిస్తోంది ఇంటర్ బోర్డు. అందుకోసం రెండు రోజుల క్రితమే హాల్టికెట్లను కూడా విడుదల చేసింది. ఇక హాల్ టికెట్లు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నవి.. ఇక ఇప్పుడు ఈ విధానాన్ని కోరుతూ సస్పెండ్ ను కొట్టివేయడంతో మరొక సారి హాల్టికెట్లు వెలువడే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా దీంతో విద్యార్థులు కాస్త ఆనంద పడుతున్నారు అని చెప్పవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి