ఎవరైనా పెళ్ళి అంటే అందంగా ముస్తాబు అవ్వాలని అనుకుంటారు.పెళ్ళి జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకుంటారు.అందుకే అమ్మాయిలు నెల రోజుల నుంచి అందానికి మెరుగులు దిద్దుతారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం పెళ్ళికి, చావుకు మాత్రం పళ్ళు నల్లగా మారుస్తారు అంట.. అది వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా ఇది పక్కా నిజం..అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఇలాంటి వింత ఆచారాలు ఇప్పటికీ కొన్ని తెగల వాళ్ళు పాటిస్తున్నారు.లైఫ్‌లో ఒక్కసారే స్నానం చేయాలి, శోభనం మూడు రోజులు రూంలోంచి బయటకు రాకూడదు, పెళ్లికి ముందే తల్లి అవ్వాలి ఇలాంటి ఆచారాలకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం.. ఇది ఇంకాస్త వెరైటీ.. ఆ దేశంలో ప్రజలు ఏదైనా ప్రత్యేకమైన రోజు అయితే దంతాలకు నల్ల రంగు వేసుకుంటారట.. ఇదేంట్రా బాబు.. ఎవరైన ఫంక్షన్‌ అంటే..అందంగా మేకప్‌ వేసుకుంటారు..ఇలా పళ్లు నల్లగా చేసుకోవడం ఏంటి..? అనే సందేహం రావడం కామన్..


జపాన్ దేశంలో హీయన్ కాలంలో ఈ ప్రత్యేకమైన ఆచారం అమలులో ఉండేది.. అతి పురాతనమైన ఈ ఆచారాన్ని అప్పట్లో ఒహగురో అని పిలిచేవారు. ఈ ఒహగురో ఆచారాన్ని జపాన్‌తో పాటు, చైనా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం వంటి దేశాల్లో కూడా పాటించేవారట.. ముఖ్యంగా 794వ సంవత్సరం నుండి 1185వ సంవత్సరం వరకు ఉన్నట్లు చరిత్రకారుల మాట.. ఈ ఒహగురో సంప్రదాయాన్ని పాటించిన ఆ నాటి యువతీ యువకులు తమ పళ్లు నల్లబడేలా చేసుకునేవారు.అలా చేస్తే వాళ్ళు ఇంకాస్త యవ్వనంగా ఉంటారని వారి నమ్మకం..ఆనాటి రాజకుటుంబాల చెందిన వ్యక్తులు కూడా తమ దంతాలకు నల్లటి రంగును వేసుకునేవారు. ముఖ్యంగా వివాహం లేదా అంత్యక్రియల వంటి సందర్భాలలో కూడా ప్రజలు తమ దంతాలను నల్లగా చేసుకునేవాళ్లు. నేటికీ, జపాన్‌లోని గీషా జిల్లా మహిళలు ప్రత్యేక సందర్భాలలో తమ దంతాలను నల్లగా చేసుకుంటారట. ఎవరి నమ్మకం వారిది..తెలుసుకోవడం తప్ప మనం ఏం చేయలేం కదా..ఏంటో సైన్స్ పెరుగుథున్నా కూడా ఇలాంటి బయటకు రావడం విచిత్రమే..


మరింత సమాచారం తెలుసుకోండి: