ఎక్కడైనా ఐస్ క్రీమ్ అంటే అందరికి అందరికి ఇష్టం ఉంటుంది.. వయస్సు లా వారికి ఇష్టం ఉంటుంది. అందుకే మన దేశంలో రోజు రోజుకు ఐస్ క్రీమ్ పెరుగుతుంది. ఒకప్పుడు సమ్మర్ లో మాత్రమే కనిపించేది.. కానీ ఇప్పుడు అన్నీ కాలాల్లో లభిస్తున్నాయి.. జనాలను ఆకర్షించడానికి కొత్త పయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త ఐస్ క్రీమ్ జనాలను ఆకర్షిస్తుంది..ప్రపంచంలోని అత్యంత భారీ బడ్జెట్ అది దొరుకుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు దాని గురించి తెలుసుకుందాం...ఐస్క్రీమ్ స్టోర్లలో వీటి ధర రూ.500, రూ.1000 పైగా ఉంటుంది. అయితే, ఒక స్కూప్ ఐస్క్రీమ్ ధర బంగారంతో సమానంగా ఉంటుందంటే నమ్మక తప్పదు. ఇంతలా ఉంటుందని ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా చూశారా..న్యూయార్క్లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్క్రీమ్ను అందిస్తున్నారు.


రెస్టారెంట్లో లభించే ఫ్రోజెన్ హాట్ చాక్లెట్ 25 వేల డాలర్లకు అమ్ముడవుతోంది. ఇది ఇండియన్ కరెన్సీల్లో అక్షరాల రూ. 19 లక్షల 53 వేల కంటే ఎక్కువ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, అటువంటి ఖరీదైన ఐస్ క్రీం 28 కోకోల మిశ్రమం నుంచి తయారు చేయబడింది. ఇందులో ప్రపంచంలోని 14 అత్యంత ఖరీదైన కోకో ఉన్నాయి. అదే సమయంలో, ఐస్ క్రీం పైన ఐదు గ్రాముల బంగారు తినేది కూడా ఉంచుతారు...


ఇందులో మరో ప్రత్యేకత కూడా ఉంది. వజ్రాలు పొదిగిన బంగారం స్పూన్ కూడా ఈ ఐస్‌క్రీమ్ తినడానికి అందింస్తారు. అయితే ఈ గోల్డెన్ ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత ఈ డైమాండ్, గోల్డ్ స్పూన్ ఆ రెస్టారెంట్‌లోనే వదిలివేయకుండా ఇంటికి తీసుకెళ్లవచ్చు. న్యూయార్క్‌లోని సెరెండిపిటీ 3 రెస్టారెంట్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అందిస్తున్నాయి. దీని ధర 15,000 రూపాయలు, ఇది ప్రపంచం నలుమూలల నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలతో దీన్ని తయారు చేస్తారు..వామ్మో మన వాళ్ళు అయితే తినరు కానీ ఫారినర్స్ మాత్రం దీనికోసం క్యూ కడుతున్నారు... మీరు ఓ పారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: