అంతేకాదు నెటిజన్లు అందర్నీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ వీడియో. ఇంతకీ ఈ వీడియో లో ఏముందో తెలుసా భారీ కొండచిలువ. ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఒళ్ళు జలదరిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీడియో ని ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ శాంతా నంద సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వైరల్ గా మారిపోయింది. బయట గోడ నుంచి ఇంట్లో కి వెళ్తున్న భారీ కొండచిలువ ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఫోటోషాప్ చేసిన ఎన్నో ఫోటోలు వీడియోలు చూశాను. కానీ ఈ వీడియో మాత్రం నన్ను షాక్ కి గురిచేసింది అంటూ ఇండియన్ ఫారెస్ట్ అధికారి ఈ వీడియో కి ఒక కామెంట్ కూడా రాసుకొచ్చాడు.
వీడియోలో కనిపిస్తున్న భారీ కొండచిలువ ఏకంగా ఇంటి బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నట్లు కనిపించింది. దాదాపు 20 నుండి 30 అడుగుల పొడవు ఉన్నట్లు తెలుస్తోంది. వీడియోలు చూసుకుంటే పక్కనే మోటార్ సైకిల్, సైకిల్ కూడా పార్క్ చేసి ఉన్నాయి. ఇక ఇంటి తలుపు దగ్గర ఒక నీటి బాటిల్ ఉండగా దాని పక్కనే కొండచిలువ తల కనిపిస్తోంది ఇక ఈ వీడియో చూసి ప్రస్తుతం అందరూ షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియరాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి