శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదనే నానుడి ఉంది.. ఆయన భోళాశంకరుడు ఎంత శ్రద్దగా మనం పూజిస్తామో.. అంతే విధంగా కోరికల ను తీరుస్తారు. హిందూ సనాతన ధర్మంలో శివుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులలో ఒకరు.. లయకారుడు. జలం తో అభిషేకించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు.. హిందువులు పూజించే దేవుళ్ల లో ప్రథముడు. పశుపతిగాను, లింగం రూపంలోను సింధు నాగరికత కాలం నుంచి పూజలను అందుకుంటున్నాడు. ప్రపంచ దేశాల్లో శివ లింగాలు ఉన్నాయి అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. నేటికీ దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి.


వేదాలలో శివుడు రుద్రునిగా పేర్కొన్న శివయ్య ను భక్తులు అత్యంత భక్తశ్రద్ధల తో పూజిస్తారు. అయితే ఎటువంటి శివయ్య కు అవనమానం జరిగిందని శివ భక్తులు మండిపడుతున్నారు.. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వేలుపుల అనేక శివ లింగాలు, ఇతర దేవతలున్నారు. అయితే శివలింగాని కి కొందరు వైసీపీ కార్యకర్తలు తాళ్లు కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.


వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒక కార్యక్రమం నిర్వహించడాని కి ఆలయం సమీపంలో రెడీ అయ్యారు. టెంట్ ను వేస్తూ.. దాని తాళ్లను శివలింగానికి మూడేసి కట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడం తో సంబందించిన కార్యకర్తల పై శివ భక్తులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.. ఆలయం వద్ద వైయస్సార్ చేయూత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. శివలింగానికి తాళ్లు కట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.ఈ వీడియోను చూసిన వారంతా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన చర్చలకు దారితీసింది..


మరింత సమాచారం తెలుసుకోండి: