ఎలాంటి యుద్ధంలో అయినా బలవంతులలు గెలుస్తారు అన్నది సృష్టి ధర్మం. అయితే ఒకానొక సమయంలో బలం చూపించి భయపెట్టిన బలవంతులు కూడా తర్వాత కాలానుగుణంగా బలహీనులుగా మారిపోతారని బానిసలు అనుకున్న వారి చేతిలోనే చనిపోతారు అని ఎన్నోసార్లు నిరూపితం అయింది అని చెప్పాలి. ఇక అడవుల్లో ఉండే జంతువుల జీవనశైలి కూడా ఇందుకు అనుగుణంగానే ఉంటుంది అని చెప్పాలి. అడవికి రారాజు సింహం అని చెబుతూ ఉంటారు అందరూ. అయితే ఇక సింహం కనబడితే చాలు అడవిలో ఉన్న జంతువులు అన్ని ప్రాణభయంతో పరుగులు పెడుతూ ఉంటాయి.


 సింహంతో పోల్చి చూస్తే భారీ ఆకారం కలిగిన ఏనుగులు, గేదెలు సైతం సింహం పంజాకి భయపడుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ అలాంటి సింహమే బలహీనంగా మారితే అప్పటివరకు ఆ సింహాన్ని చూసిన భయపడిన మిగతా జంతువులని సింహం పై దాడి చేయడానికి దూసుకు వస్తూ ఉంటాయి. వయసులో ఉన్నప్పుడు నాకంటే తోపులెవరూ లేరు అనుకునే సింహం వయసు మళ్లిన తర్వాత ఎలాంటి దినస్థితిని ఎదుర్కొంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో మారుతుంది.



 ఇక ఇటీవల వైరల్ గా మారి పోయిన వీడియో  లో చూసుకుంటే ఒక ముసలి సింహం అడవిలో సేద తీరుతుంది. అదే సమయం లో అక్కడికి  బర్రెల గుంపు వచ్చింది. అయితే సాధారణం  గా అయితే సింహం అలా గేదెలు దగ్గరికి వచ్చిన సమయం లో ఒక్క సారిగా గాండ్రించి భయపెడుతుంది. కానీ ఆ సింహం ముసలిది కావడం తో ఏం చేయలేకపోయింది. దీంతో నిద్రపోతున్న సింహాన్ని లేపినప్పటికీ ఆ సింహం ఏమి చేయలేకపోయింది. ఇక గేదెల గుంపు కొమ్ములతో ఆ సింహాన్ని గాల్లోకి ఎగరవేయడం మొదలుపెట్టాయి. ఆ గేదెల గుంపును ఎదుర్కోవడం ఆ సింహం వల్ల కాలేదు. దీంతో  చెట్ల పొదల్లో దాక్కుంది ఆ సింహం.

మరింత సమాచారం తెలుసుకోండి: