పాము.. ఈ పేరు వినిపించిందంటే చాలు చాలామంది జనాల్లో తెలియకుండానే వెన్నులో వణుకు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఉండే అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో అటు పాములు కూడా ఒకటి అని చెప్పాలి. మనిషి ఆకారంతో పోల్చి చూస్తే పాములు ఆకారం చిన్నగానే ఉంటుంది. కానీ ఒక్కసారి పాము కాటు వేసింది అంటే చాలు ఆరడుగుల మనిషి సైతం గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోవాల్సిందే. అంత ప్రమాదకరమైనది పాము. అందుకే పాము పేరు వినిపిస్తే తెలియకుండానే మనిషిలో భయం పుడుతూ ఉంటుంది. కొంతమంది పైకి ధైర్యంగా నటించిన.. లోలోపల మాత్రం భయపడుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే కళ్ళ ముందు ఉంది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ ఎందుకో ఆటోమేటిక్గా భయం మాత్రం పుడుతుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు చాలానే ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఈ వీడియోల ద్వారా పాముల కదలికలు ఎలా ఉంటాయి. అవి ఎంత వేగంగా దాడి చేస్తాయ్ అన్న విషయాలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. అందుకే ఇలా పాములకు సంబంధించిన వీడియో ఏదైనా ఇంటర్నెట్ లోకి వచ్చిందంటే అది నిమిషాల వ్యవధిలోని వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారింది అని చెప్పాలి. ఈ వీడియోలో ఏకంగా రెండు విషపూరితమైన పాములు పోట్లాడుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఒక పాము మరో పాము మెడను తోకతో గట్టిగా చుట్టేసింది.. ఏకంగా ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏకంగా ఆదిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో ఒక పాము చివరికి తోకతో మరో పాము మెడను చుట్టేసి కదలనివ్వకుండా చేసింది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: