గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి కూరగాయలు కొనాలి అంటే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా టమోటా నిన్నా మొన్నటిదాకా ఈ పేరు బాగా వినిపించింది. ఎక్కడ చూసినా టమోటా గురించి పలు రకాల రీల్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. దీంతో వీటిని కొనాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది పేద దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా టమోటాను వాడడమే తగ్గించేసారని చెప్పవచ్చు.. ఇక ఇటీవలే మదనపల్లి మార్కెట్లో టమోటా కిలో ధర రూ .200 రూపాయలకు పైగా పలికినట్లు తెలుస్తోంది.

దీంతో టమోటా ధనవంతుల ఇంటికి కూరగాయలుగా మారిపోయాయి. అయితే ఈ పరిస్థితులనుంచి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఈ రోజున ఒక్కసారిగా ధర డౌన్ అవుతూ వచ్చినట్టుగా తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలోని ప్రత్యేకించి మదనపల్లి ప్రాంతంలో విస్తరంగా సాగుచేసిన టమోటా ఈసారి రైతులకు కాసుల వర్షాన్ని కురిపించింది. మేలు రకం టమోటా ఏ గ్రేడ్ ధర ఊహకందని విధంగా పెరిగిపోయింది. ప్రస్తుతం మదనపల్లిలో టమోటా దిగుబడులు ఎక్కువ కావడం చేత టమోటా ధరలకు బ్రేక్ పడినట్లుగా తెలుస్తోంది.


ఒక్కసారిగా మదనపల్లి మార్కెట్లో టమోటా రేటు తగ్గడం జరిగింది ఇతర ప్రాంతాలలో జిల్లాలోని టమోటా దిగుబడి రావడంతో దరఖాస్తా డౌన్ అయినట్లుగా తెలుస్తోంది.. అమ్మకానికి వచ్చిన 404 మెట్రిక్ టన్నుల టమోటా రాగా ఈ రోజున అదే స్థాయిలో ఆర్థెవల్స్ వలస కూడా వచ్చాయట. దీంతో ఏ గ్రేడ్ టమోటా ధర అత్యధికంగా రూ.116 రూపాయల పలకగా.. అటు కర్నూలులో కూడా టమోటా ధరలలో గణనీయంగా మార్పులు వచ్చాయి నాలుగు రోజులలో ఒక్కసారిగా భారీ పతనానికి టమోటా ధర పడిపోయింది రూ .60 రూపాయలు చొప్పున లభిస్తున్నాయి. నిన్న మొన్నటివరకు చికెన్ చేపల ధరలతో పోటీపడ్డ టమాట ఒక్కసారిగా పడిపోవడంతో పేదల కష్టాలకు ఏపీ ప్రభుత్వం కూడా రైతుల నుంచి నేరుగా టమోటాలను కొని రూ .50 రూపాయలకే ప్రజలకు ఇచ్చేలా పలుచోట్ల రైతుబజార్లను కూడా ఏర్పాటు చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: