90ల నాటి కిడ్స్ కి నేటి జనరేషన్ పిల్లలకు ఆలోచన విధానంలోనే కాదు ప్రతి విషయంలో కూడా జనరేషన్ గ్యాప్ ఉంటుంది అని అందరూ ఉంటూ ఉంటారు. జనరేషన్ గ్యాప్ అనేది కేవలం ఒట్టి మాటలు మాత్రమే అని కొంతమంది కొట్టి పారేస్తారు. కానీ ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే నిజంగానే ఒకప్పటి బాల్యానికి ఇప్పటి చిన్నపిల్లల బాల్యానికి చాలా తేడా ఉందని అర్థమవుతుంది. ఒకప్పుడు ఒక ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు స్నేహితులతో గోళీలు, గిల్లికజ్జాలు ఆడుకోవడం మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు అదే వయసులో ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు నేటి జనరేషన్ పిల్లలు.
ఇక్కడ 5 ఏళ్ళ చిన్నారి చేసిన సాహసానికి నెటిజన్స్ అందరూ కూడా ఫిదా అవుతున్నారు. ఆమె పేరు ఐరాహ్ ఐమీన్ ఖాన్ యూనిక్. ఈ చిన్నారి కొచ్చికి చెందినది. అయితే ఆమె నివసించే పెరటిస్కేట్ పార్కులో వద్ద ఈ చిన్నారి సాహసం చేసింది. ఏకంగా తనలో ఉన్న స్కేటింగ్ నైపుణ్యాలను చూపించింది. ఇది చూసి అందరూ మంత్రముగ్దలు అవుతున్నారు. ఓనం వేడుకలకు సరిపోయే వస్త్రధారణ ధరించిన చిన్నారి ఇలా స్కేటింగ్ చేయడం చూసి నేటిజన్స్ ఫిదా అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా వైరల్గా మారిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి