మనకు జీవితాన్ని ఇచ్చేది తల్లి తండ్రులు. అమ్మ నవమాసాలు మోసి మనల్ని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తే, నాన్న మనకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ముందుండి నడిపిస్తాడు. అమ్మ గోరు ముద్దులతో, తియ్యటి మాటలతో తన ప్రేమను కురిపిస్తే, తండ్రి బిడ్డలపై ఉన్న తన బాధ్యతను నెరవేరుస్తూ తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు.