మెదడు అనేది మన శరీరం లోనే అత్యంత కీలకమైన భాగాలలో ఒకటి. మన శరీర అవయవాలను మన మనస్సుని నియంత్రించేది మెదడే. మెదడు చురుగ్గా ఉన్నప్పుడే పనులు, ఆచరణలు కూడా చురుగ్గా మెరుగ్గా ఉంటాయి. అలాంటిది అనవసరమైన ఆలోచనలతో లేని పోని తగాదాలతో మన మనసుని మనమే బాధించుకుని కష్ట పెట్టుకోకూడదు. ఇలా చేయడం వలన ఈ ప్రభావం మెదడుపై పడి ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. మానసికంగా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అవి మన కార్యకలాపాలను సవ్యంగా జరగనివ్వక పోవచ్చు. తద్వారా మనకి అందాల్సిన విజయాలను, సంతోషాలను దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.

కాబట్టి మనస్సుని వీలైనంత ప్రశాంతంగా ఉంచుకోవాలి. తద్వారా మెదడుకి కూడా ప్రశాంతత లభిస్తుంది. మనసు స్థిమితంగా ఉంటే ఆలోచనలు కూడా ఉత్తమంగా ఉంటాయి, అనుకున్న కార్యాలను ఎటువంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయగలం, కోరుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలము. అలా కాకుండా ప్రతి చిన్న విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుంటూ బాదపడిపోవడం, పదే పదే వాటి గురించే తలుచుకుంటూ మానసికంగా కుంగి పోవడం వంటివి చేయడం మంచిది కాదు. అలాంటివి మన భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతాయి.

మనిషి అన్న తరువాత సమస్యలు, అపుడప్పుడు ఇతరులతో మనస్పర్ధలు రావడం సహజం. అలాగని అందరూ అన్ని సందర్భాల్లోను మనకి నచ్చిన పనులే చెయ్యాలంటే  అది సాధ్యపడదు కదా. అలాంటప్పుడు వాటిని లైట్ తీసుకుని ముందుకు సాగాలి తప్ప, వాటి గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృదా చేసుకోకూడదు. అలా కాకుండా అన్నిటినీ బూతద్దం లో పెట్టీ చూస్తూ ఏదో జరిగిపోతుందని భయపడుతూ బాధపడుతూ ఉంటే మానసికంగా నలిగిపోయి నిరాశ చెందేలా చేస్తాయి. కావున అనవసరమైన వాటికి సమయం కేటాయించకుండా పాజిటివ్ గా థింక్ చేయండి ....లక్ష్యం దిశగా అడుగులు వేయండి. మీ జీవితాన్ని మీరే అందంగా మలచుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: