కావలసిన పదార్థాలు : పెద్ద నిమ్మకాయలు : రెండు శెనగపప్పు : ఒక టీ. ఆవాలు :  ఒక టీ. ఎండు మిరపకాయలు :  3 పచ్చిమిరపకాయలు : 4 లేక 5 ఇంగువపొడి :  తగినంత పసుపు పొడి : పావు టీ స్పూన్ నూనె : 7 లేక 8 టీ స్పూన్ ఉప్పు :  పావు టీ స్పూన్  తయారీ విధానం : సెనగ పప్పు నానబెట్టాలి. నిమ్మకాయ పిండి, రసం తీసుకొని దానిని వడకట్టి గిన్నెలోకి తీసుకోవాలి. పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసంతో కలుపుకోవాలి. బాణలిలో నూనె వేసి, ఆవాలు, ఎండు మిరపకాయలు, ఇంగువ కలిపి పోపు వేసుకోవాలి. పోపు వేసిన దాంట్లోనే పచ్చిమిరపకాయలు, నానబెట్టిన పప్పు కూడా వేసి వేయించాలి. తరువాత నిమ్మరసం పిండి బాగా కలిపి చల్లారిన సేమ్యాకి కలపాలి. అంతే నిమ్మకాయ సేమ్యా సిద్ధమైనట్లే...!

మరింత సమాచారం తెలుసుకోండి: